Multibagger Stock: సాధారణంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి అనేక సూచీలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. కొన్ని కంపెనీల్లో ప్రముఖులు లేదా ప్రముఖ సంస్థలు ఇన్వెస్ట్ చేయటంతో అవి మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్టాక్ సైతం భారీగా లాభపడి సంచలనంగా మారింది.

కంపెనీ షేర్ గురించి..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బీఎల్ఎస్ ఇంటర్నేష్నల్ సర్వీసెస్ కంపెనీ స్టాక్ గురించే. సింగపూర్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ నోమురా ఈ కంపెనీలోలో భారీగా వాటాలను కొనుగోలు చేసింది. గత నెలలో నోమురా 12.5 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. వీటి విలువ దాదాపు రూ.267.50 కోట్లుగా ఉంది.

కొత్తగా మరిన్ని వాటాల కొనుగోలు..
తాజాగా ఎన్ఎస్ఈ అందించిన బల్క్ డీల్ వివరాల ప్రకారం కంపెనీలో నోమురా రూ.253 కోట్ల విలువైన.. 11 లక్షల షేర్లను కొత్తగా కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ వివరాలు బహిర్గతం కావటంతో షేర్ విలువ అమాంతం 18 శాతం మేర పెరిగింది. దీంతో స్టాక్ తన జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది.

స్ట్కాక్ ధర వివరాలు..
మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో స్టాక్ దాదాపు రూ.33 లాభపడి రూ.261.20 వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.269.70 వద్ద ఉండగా.. షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 89.73గా ఉంది. ఈ రోజు ఇంట్రాడేలో స్టాక్ ఏకంగా 18 శాతం వరకు పెరిగింది. ఒక్కరోజులోనే మల్టీబ్యాగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది.

కంపెనీ వ్యాపారం..
కంపెనీ టెక్నాలజీ ఆధారిత వీసా ప్రాససింగ్ సేవలను అందిస్తుంది. దిల్లీ కేంద్రంగా కంపెనీ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది. కంపెనీ ప్రభుత్వాల కోసం వీసా, పాస్‌పోర్ట్, కాన్సులర్, ధృవీకరణ, పౌర సేవలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం కంపెనీ ఆసియా, ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ రాష్ట్ర, ప్రాంతీయ ప్రభుత్వాలకు కూడా పౌర సేవలను అందిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications