నోకియా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది..దాని తలరాతను భారతీయుడు ఎలా మార్చాడు..విశ్లేషణాత్మక కథనం

ఒకప్పుడు మొబైల్ మార్కట్ ని ఏలిన నోకియా సంస్థ, ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్ల రాకతో 2010లో తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. స్టాక్ మార్కెట్‌లో వెనుకబడి, మొబైల్ ఫోన్ వ్యాపారం నుండి కనుమరుగైపోయింది. ఫీచర్ ఫోన్ రంగాన్ని ఏలిన నోకియా ప్రస్తుతం చైనా కంపెనీలు, ఆపిల్ కంపెనీ, శాసంగ్ కంపెనీల ఆధిపత్యంలో నిలబడలేకపోయింది. ప్రస్తుతం నోకియా పరిస్థితి ఏమిటో తెలుసా?

కొత్త సాంకేతికతను అందుకోలేక, ప్రజల అభిరుచులకు తగిన విధంగా తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయలేక 2011లో పదేళ్లలో మొదటిసారిగా నోకియా భారీ నష్టాలను చవిచూసింది. ఇది ఆర్థిక చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే కంపెనీ దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా 2014లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి ముఖ్యమైన మార్పుగా నోకియా నాయకత్వ బాధ్యతలను భారతీయుడైన రాజీవ్ సూరికి అప్పగించింది.

nokia 5g technology rajeev suri mobile phone decline nokia recovery 5g

ఇది సంస్థను పూర్తిగా మార్చివేసింది. దివాళా అంచున ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే సామ్రాజ్యంగా అవతరించింది. నోకియా తన స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన మోడళ్లను ఇప్పటికీ విక్రయిస్తోంది. అయితే స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ వ్యాపారం, ఆదాయం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ నోకియా 5G సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది. 24 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా ఎదిగింది.

నోకియా తదుపరి వ్యాపార ప్రస్థానం 2014లో ప్రారంభమైంది. రాజీవ్ సూరి నాయకత్వంలో తీసుకున్న ఒక తెలివైన నిర్ణయంతో మళ్లీ ఆధిపత్యంలో నిలిచింది నోకియా. మొబైల్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తిరిగి ఆధిపత్యం కన్నా.. టెలికాం పరికరాలు, నెట్‌వర్కింగ్ పరికరాలను లక్ష్యంగా చేసుకోవాలని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాజీవ్ సూరి CEOగా నియమితులైన తర్వాత నిర్వహణ బృందంతో జరిగిన సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తారు: "స్మార్ట్‌ఫోన్ దాటి నోకియా దేనిలో ప్రపంచవ్యాప్తంగా రాణించగలదు? అని అడిగారు. దీనికి సమాధానంగా నోకియా సంస్థకు బలంగా నిలిచిన నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల విభాగాన్ని ఎంచుకున్నారు. ఈ విభాగం 2009 నుండి 2014 వరకు రాజీవ్ సూరి నేతృత్వంలోనే కొనసాగింది.

ఈ సమావేశం తర్వాత నోకియా మొబైల్ ఫోన్‌ మార్కెట్ నుండి వైదొలిగి, టెలికాం నెట్‌వర్క్, టెలికాం ఎంటర్‌ప్రైజ్ సేవల విభాగం వైపు తన దృష్టిని మరల్చింది. ఈ మార్పు ఒకప్పుడు మొబైల్ ఫోన్‌లతో గుర్తించబడిన సంస్థకు చాలా ప్రమాదకరమైనది అయినప్పటికీ.. 5G సాంకేతికత యొక్క భవిష్యత్తుపై ఉన్న నమ్మకం కారణంగా సూరి తీసుకున్న నిర్ణయం నోకియా విజయానికి పునాది వేసింది.నోకియా తదుపరి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మలుపు 2015లో ఆల్కాటెల్-లూసెంట్ సంస్థను 16.6 బిలియన్ డాలర్లకు నోకియా కొనుగోలు చేయడం. ఈ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా దాదాపు 29,000 పేటెంట్లు, టెలికమ్యూనికేషన్ పరిశోధనలో లోతైన ఆవిష్కరణలను నోకియా పొందింది.

nokia 5g technology rajeev suri mobile phone decline nokia recovery 5g

ఈ నిర్ణయం 5G సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థగా నోకియాను నిలబెట్టడానికి పెద్ద ఎత్తున సహాయపడింది. 2018లో నోకియా రీఫ్‌షార్క్ (ReefShark) అనే 5G చిప్‌ను విడుదల చేసింది. ఇది ఆ కాలంలో చాలా చిన్నది, వేగవంతమైనది. సమర్థవంతమైన చిప్‌గా నిలిచింది. ఈ పరిచయం నోకియా వృద్ధి వేగాన్ని అనేక రెట్లు పెంచింది. నోకియా పునర్జన్మలో రెండవ విజయం ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ 5G ఒప్పందాలను 2024 నాటికి నోకియా పొందడం. ముఖ్యమైన టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్లతో కలిసి 5G సాంకేతికతను ప్రపంచానికి తీసుకువచ్చింది.

ఈ ఒప్పందాలు నోకియాను ప్రపంచ టెలికాం అనుసంధానానికి కేంద్రంగా మార్చాయి. 2022లో నోకియా యొక్క వార్షిక ఆదాయం 20 బిలియన్ డాలర్లను దాటింది. చైనా వెలుపల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 29% 5G వ్యాపారాన్ని పొందింది. ఈ విజయం నోకియా గత వైఫల్యం నుండి కోలుకోవడానికి సహాయపడింది. నోకియా విజయంలో మరొక ముఖ్యమైన అంశం దాని మార్కెటింగ్ వ్యూహం. "5G ద్వారా ఉత్తమమైన, అనుసంధానించబడిన ప్రపంచాన్ని సృష్టిద్దాం" అనే సందేశాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేశారు. నోకియా తనను తాను సాంకేతిక విక్రేతగా మాత్రమే కాకుండా భవిష్యత్తును రూపొందించేదిగా కూడా నిలబెట్టుకుంది.

nokia 5g technology rajeev suri mobile phone decline nokia recovery 5g

ఈ ప్రకటన పెట్టుబడిదారులు,వినియోగదారులలో నోకియా యొక్క కొత్త రూపాన్ని బలోపేతం చేసింది. రాజీవ్ సూరి నాయకత్వంలో సంస్థ యొక్క ఖర్చులను తగ్గించి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించి, సాంకేతిక ఆవిష్కరణలకు ఎక్కువ పెట్టుబడి పెట్టారు.అయితే నోకియా తలరాతను మార్చిన రాజీవ్ సూరి 2021లో నోకియాను విడిచి వెళ్లారు. 1995 నుండి 2021 వరకు నోకియాలో అనేక పదవుల్లో పనిచేసిన రాజీవ్ సూరి ప్రస్తుతం బ్రిటన్ కృత్రిమ ఉపగ్రహ టెలికాం సేవల సంస్థ అయిన Inmarsat-కు CEOగా ఉన్నారు.

1967 అక్టోబర్ నెలలో ఢిల్లీలో జన్మించిన రాజీవ్ సూరి కువైట్‌లో పెరిగారు. ప్రస్తుతం సింగపూర్ దేశ పౌరుడిగా ఉన్న ఆయన లండన్ నుండి పనిచేస్తున్నారు. ఆయన మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ECE విభాగంలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తర్వాత విదేశాల్లో తన విద్యను కొనసాగించారు.నోకియా మళ్లీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుందంటే.. భారతీయుడైన రాజీవ్ సూరి ముఖ్య కారణం. ఆయన లేకుంటే నోకియా కనుమరుగైపోయేది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+