Layoffs: ఖర్చులు తగ్గించుకోవడం పేరిట ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఒక్క IT సెక్టార్ మాత్రమే కాకుండా ఇతర రంగాలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా మరో దిగ్గజ సంస్థ వేలకొద్దీ సిబ్బందికి షాక్ ఇవ్వడానికి రెడీ అయింది.
మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో భారతీయులకు అత్యంత చేరువైన నోకియా.. తన ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఆర్థిక స్థిరత్వం కోసం ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం తన శ్రామిక శక్తిలో ఏకంగా 14 వేల మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది.

కంపెనీ కీలక మార్కెట్ ఉత్తర అమెరికాలో 5జీ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మూడో త్రైమాసికంలోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించడం సంస్థను మరింత నిరుత్సాహపరిచింది. దీంతో 2026 నాటికి 800 మిలియన్ నుంచి 1.2 బిలియన్ యూరోల మేరకు పొదుపు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగుల కోతకు సిద్ధమైంది.
ప్రస్తుతం నోకియాలో 86 వేల మంది శ్రామిక శక్తి పనిచేస్తోంది. ఈ సంఖ్యను 72 నుంచి 77 వేలకు కుదించాలని కంపెనీ నిర్ణయించుకుంది. తద్వారా 2024లో ఏడాదికి 400 మిలియన్ యూరోలు, 2025లో అదనంగా మరో 300 మిలియన్ యూరోలు పొదుపు చేయాలని చూస్తోంది. అయితే ఈ నిర్ణయం వేలాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications