Vodafone Ideaకి ఎదురుదెబ్బలు.. 5Gకి అది కుదరదని తేల్చి చెప్పిన దిగ్గజ కంపెనీలు..
Vodafone Idea: ఇండియా టెలికాం మార్కెట్లో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొంది. ప్రధానంగా ఎయిర్ టెల్, జియో మధ్యే పోటీ కొనసాగుతోంది. ఇదే క్రమంలో వినియోగదారులకు ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ స్పీడు పెంచగా.. వొడాఫోన్ ఐడియా(Vi) మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది.
ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ 5జీ సాంకేతికతను విస్తరిస్తూ ప్రధాన నగరాల్లో సేవలను అందుబాటులోకి తెస్తుండగా. Vi నుంచి మాత్రం 5జీ సాంకేతిక అందిపుచ్చుకోవటంలో వెనకబడే ఉంది. ఇప్పటికే పెరుగుతున్న అప్పుల కుప్పలు, భారీ నష్టాలు, వరుసగా వీడుతున్న వినియోగదారులు వంటి సమస్యలతో ఊపిరి సలుపుకోలేకపోతోంది. అయితే ఇటీవల బోర్డులోకి కుమార మంగళం బిర్లా తిరిగి రావటం ఇన్వెస్టర్లలో కొత్త నమ్మకాన్ని కలిగించింది.

అయితే 5జీ పరికరాలను అప్పుపై అందించేందుకు నోకియా, ఎరిక్సన్ సంస్థలు నిరాకరించాయి. ముందస్తు చెల్లింపు స్వీకరించిన తర్వాత మాత్రమే పరికరాలను సరఫరా చేయగలమని వొడాఫోన్ ఐడియాకు తేల్చి చెప్పేశాయి. ఎందుకంటే ఇప్పటికే విక్రేతలకు కంపెనీ రూ.3,500-రూ.4,000 కోట్ల వరకు బకాయిపడినట్లు వెల్లడైంది. టెలికాం సంస్థకు సరఫరాను నిరాకరచించటం దాని ఆర్థిక ఒత్తిడిని హైలైట్ చేస్తోంది.
ఈ పరిస్థితులు వొడాఫోన్ ఐడియా 5G విస్తరణ ప్రణాళికలు ఆలస్యం కావడానికి కారణం కావచ్చని తెలుస్తోంది. దీంతో టెలికాం పరిశ్రమలో నెలకొన్న పోటీలో వెనకపడింది. దక్షిణ కొరియాకు చెందిన ఓపెన్ RAN సరఫరాదారు మావెనిర్ & శామ్‌సంగ్‌తో 5G పరికరాలపై చర్చలు జరుపుతోంది. కర్ణాటక సర్కిల్‌లో మావెనిర్‌తో 5G ప్రయోగాలను నిర్వహిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌లకు పరిసకరాలను నోకియా, ఎరిక్సన్ ఎక్కువగా సరఫరా చేస్తున్నాయి.
ఉదాహరణకు Ericsson ఇటీవల Viకి అనేక 2G రేడియోలకు పూర్తి ధరను చెల్లించిన తర్వాతే సరఫరా చేసింది. 5G నెట్‌వర్క్ విస్తరణ నవంబర్ చివరిలో/డిసెంబరు ఆరంభంలో నిర్ణయించబడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని వారాల్లో కొనుగోలు ఆర్డర్ ఇవ్వవచ్చని టెలికాం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో రుణ చెల్లింపులు, 5G నెట్‌వర్క్ పెట్టుబడి కోసం సుమారు రూ. 20,000 కోట్లను సేకరించేందుకు పలు ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారులతో ముందస్తు చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. దీంతో కంపెనీ స్టాక్ ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications