TCS ఆఫీసులోనే ఇలా జరిగితే… వేరే IT కంపెనీల్లో పని చేసే మా పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు!

నోయిడాలోని TCS యమునా ఆఫీస్ లో ఒక ఉద్యోగి, తన రాజీనామా చేస్తే వచ్చే బోనస్ డబ్బు కోసం అడిగినప్పుడు HR టీమ్ నాతో దాడి చేసింది అని ఉద్యోగి చెప్పాడు. ఈ కథ ఇప్పుడు రెడ్డిట్ లో వైరల్ అవుతూ, IT వర్క్‌ప్లేస్ లో ఎథిక్స్, ఉద్యోగ హక్కులు పై చర్చలకు దారితీసింది.

ఏమైంది అంటే ఉద్యోగి సెప్టెంబర్ 19న అనుకోకుండా తొలగించబడ్డాడని చెప్పారు. నన్ను ఎందుకు తొలగించారో, సీవరెన్స్ పే వచ్చిదా, వదిలి వెళ్ళిపోడానికి ప్రక్రియ ఏమిటో, ల్యాప్‌టాప్ రిటర్న్ వంటి వివరాలు తెలుసుకోవాలనుకున్నాను" అని ఆయన చెప్పారు. అయితే, ఎంత ఇమెయిల్స్, కాల్స్ చేసినా HR నుండి సమాధానం రాలేదు.

Noida TCS office incident Employee claims HR attack no severance pay

ఉదయం 10:30కి ఆయన యాక్సెస్ బ్లాక్ అయింది. అందువల్ల సాయంత్రం 4:30కి ఆఫీసుకి వెళ్లి, ఒక HR సిబ్బంది అతనికి మేము సమాధానం ఇవ్వము. మీరు తొలగించబడ్డారు ఎక్కడకి వెళ్ళైనా పోరాడండి" అని చెప్పాడు. భద్రత కోసం ఫోన్ కెమెరా ఆన్ చేసి తిరిగి వెళ్లినప్పుడు, మరొక HR సిబ్బంది తన సహచరులకు ఫోన్ తీయమని ఆదేశించారు. వారు నన్ను బలవంతంగా అడ్డుకున్నారు. నా కుడి చేయి మెలిపెట్టారు, నొప్పి వచ్చింది. నాకు చాలా అవమానంగా అనిపించింది" అని ఆయన రాశారు. ఆ సమయంలో నేను పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి, రాత పూర్వ ఫిర్యాదు, వీడియో సాక్ష్యం ఇచ్చాను. HR‌ని కూడా రావాలని అడిగాం, కానీ వాళ్ళు రాకపోవడంతో సమస్య మరింత పెరిగింది.

నాకు ఇప్పటివరకు సీవరెన్స్ పే ఇవ్వలేదు. ఈ విషయానికి సంబంధించిన ఫార్మల్ సమాధానం కూడా కంపెనీ నుంచి రాలేదు. అంతేకాకుండా, నాపై భౌతిక దాడి కూడా జరిగింది. ఒక ఉద్యోగి ఇలా అన్యాయానికి గురయ్యే పరిస్థితి వస్తే, IT కంపెనీలో పనిచేస్తున్న వాళ్లు ఎవరిని ఆశ్రయించాలి? లేబర్ కోర్ట్‌ని ఆశ్రయించాలా? లేక నేరుగా DCP వద్ద ఫిర్యాదు చేయాలా? లేక కోర్ట్‌కి వెళ్లాలా?" అని ఆయన తన పోస్ట్‌లో ప్రశ్నించాడు.

రెడ్డిట్‌లో ఈ విషయం వైరల్ అయిన తర్వాత చాలా మంది యూజర్లు తమ తమ సలహాలు ఇచ్చారు. కొందరు యూజర్లు, "ఆఫీసులో దాడి జరిగిందంటే అది చాలా సీరియస్ విషయం. వెంటనే లాయర్‌ని సంప్రదించండి. మీ దగ్గర ఉన్న వీడియో ప్రూఫ్‌ని లింక్డ్ఇన్లో షేర్ చేస్తే, కంపెనీపై మరింత ప్రెజర్ పెరుగుతుంది" అని సూచించారు. మరికొందరు, "వీడియోని బయట పెడితే కంపెనీకి తప్పనిసరిగా రెస్పాన్స్ ఇవ్వాల్సిందే. HR మీద బాధ్యతలు మోపి వారిపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది" అని కామెంట్స్ చేశారు. అదే సమయంలో, కొంతమంది ఉద్యోగులు వేరే కోణంలో ఆలోచించి, కార్పొరేట్ 9-5 జాబ్స్‌లో ఇలా ఇబ్బందులు వస్తే స్విగ్గీ, జొమాటో, రాపిడో, బ్లింకిట్ లాంటి ప్లాట్‌ఫార్మ్ జాబ్స్ కూడా ఓప్షన్‌గా చూసుకోవచ్చని సూచించారు.

ఇప్పుడు TCS అధికారికంగా ఆ మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలను అంగీకరించలేదు. ఆయన సీరెన్స్ పే గురించి అడిగినప్పుడు HR Team చేత దాడి చేయబడినట్లు చెప్పిన విషయం తప్పుడు మరియు వాస్తవానికి విరుద్ధమని కంపెనీ తెలిపారు. సెప్టెంబర్ 19న నోయిడా, యమునా ఆఫీసులో జరిగిన ఘటన గురించి ఆ ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ పెట్టారు, అది వైరల్ అయింది, ఈ విషయం వర్క్‌ప్లేస్ నైతికత, HR ప్రాక్టీసెస్ పై పెద్ద చర్చను కలిగించింది.

ఈ ఏడాది TCSలో ఇలా కొన్ని కేసులు ఎక్కువగా బయట పడుతున్న కారణం, కంపెనీని కొన్ని మేజర్ రీస్ట్రక్చరింగ్, ఉద్యోగుల తొలగింపులు, వర్క్‌ప్రెషర్ వంటి కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు అకస్మాత్తుగా తొలగించబడ్డారని, సీవరెన్స్ పే లేదా వెళ్ళిపోవడం పై సరైన సమాధానం రాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. అంతే కాక, సోషల్ మీడియాలో ఉద్యోగుల పోస్ట్‌లు ఎక్కువ వైరల్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు ప్రజలకు, మీడియాకు తెలిసేలా జరుగుతున్నాయి. దీంతో TCSలో HR సంబంధిత సమస్యలు, ఉద్యోగుల అసంతృప్తి, ఆఫీస్ లో ఎమోషనల్ స్ట్రెస్ వంటి అంశాలు ఎక్కువ దృష్టికి వస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+