Startup News: ప్రస్తుత కాలంలో కంపెనీలు ఉద్యోగులను తొలగించటానికి వాడని మార్గాలు లేవు. అయితే ప్రస్తుతం నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఒకటి ఉద్యోగులను సర్వే ద్వారా తొలగించటం పెద్ద సంచలనంగా మారింది. భారతీయ కంపెనీలు వెస్ట్రన్ సంస్థల మార్గంలో ఇలా ముందుకు సాగటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హోమ్ సెలూన్ సర్వీసెస్ కంపెనీ యెస్‍మేడమ్ గురించే. కంపెనీ ఇటీవల దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించింది. వాస్తవానికి కంపెనీ అంతర్గతంగా ఉద్యోగుల నుంచి పనిలో ఒత్తిడి గురించి ఒక సర్వే నిర్వహించింది. ఇందులో నిజం ఒప్పుకుని, పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వెల్లడించిన వారిని టార్గెట్ చేసిన స్టార్టప్ కంపెనీ. కంపెనీ ఉద్యోగులను తొలగించటానికి కారణాలు బయటకు రావటంతో వివాదం చెలరేగింది. ఇండిగోలో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ షితిజ్ డోగ్రా లింక్డ్‌ఇన్‌లో యెస్‌మేడమ్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ తమ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన తర్వాత మ్యాటర్ వైరల్ అయ్యింది.

కంపెనీ ఉద్యోగులకు పంపిన మెయిల్ పరిశీలిస్తే.. ఇటీవల మేము సర్వే నిర్వహించాము. పనిలో ఒత్తిడి గురించి మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాము. మీరు అందించిన వివరాలకు మేము విలువ ఇవ్వటంతో పాటు గౌరవిస్తున్నాం. కంపెనీలో ఆరోగ్యకరమైన, సపోర్టివ్ వర్క్ వాతావరణం కోరుకుంటున్నామని. అందువల్ల ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులను తొలగించాలని తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాం అని ఉద్యోగులకు హెచ్ఆర్ అషు అరోరా జాన్ పంపిన డిపార్ట్మెంట్ మెయిల్ పేర్కొంది. పైగా ఇది వెంటనే అమలులోకి వస్తుందని, ఈ నిర్ణయంతో ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఇతర వివరాలు షేర్ చేయబడతాయని అందులో పేర్కొనబడింది.

కంపెనీ ఇంత నిర్థాక్షణ్యంగా ఉండటంపై నెట్టింట కంపెనీ చేసిన పనిని చాలా మంది ఎండగడుతున్నారు. దీనిపై స్పందించిన వందల మంది యూజర్లు ఉద్యోగులను తొలగించిన తీరుపై మండిపడుతున్నారు. ఉద్యోగులు తమ మెంటల్ హెల్త్ గురించి వాస్తవంగా, నిజాయతీగా వెల్లడించినందుకు ఉద్యోగం నుంచి తొలగించటం స్టార్టప్ చేసిన పెద్ద తప్పుగా వారు చెబుతున్నారు. ఇదే క్రమంలో స్టార్టప్ కంపెనీ చేసిన పనిపై ఆల్ ఇండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందిస్తూ.. ఈ రోజుల్లో వ్యవస్థలోని లొసుగుల కారణంగా ప్రజలు అనవసర ప్రయోజనాలను పొందుతున్నారు. మీరు చెల్లించలేకపోతే, అద్దెకు తీసుకోకండి. మీరు ఆరోగ్యకరమైన కార్యాలయ వాతావరణాన్ని నిర్ధారించలేకపోతే అద్దెకు తీసుకోకండి. ఉద్యోగులను మానసికంగా వేధించవద్దు అంది.


Click it and Unblock the Notifications