Tech News: దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలోని కొన్ని కంపెనీల తీరు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. కంపెనీలు చూపిస్తున్న వివక్షకు సంబంధించిన తాజా పరిణామం ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారింది. అయితే కంపెనీలు ఇలా ఎందుకు చేస్తున్నాయనే ప్రశ్నలు మార్తం తమ జవాబుకోసం వెతుకుతూనే ఉన్నాయి.
నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న మౌనీ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ తీరుపై టెక్కీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సంస్థ తన లింక్డ్‌ఇన్‌లో వివక్షతతో కూడిన జాబ్ లిస్టింగ్‌ను పోస్ట్ చేసిన తర్వాత విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాము డేటా అనలిస్ట్ పాత్రకు ఉద్యోగి కోసం వెతుకుతున్నామని వెల్లడించిన సంస్థ అందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలను అనర్హులుగా పేర్కొంది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాలకు చెందిన టెక్కీలను నియమించుకోమంటూ సంస్థ బాహాటంగానే ఉద్యోగ ప్రకటనలో వెల్లడించటం పెద్ద చర్చకు దారితీసింది.

మౌనీ కన్సల్టింగ్ సంస్థ తన ఉద్యోగ పోస్టింగ్‌లో 4 ఏళ్లు అనుభవం కలిగిన టెక్కీల కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది. అలాగే పనిలో భాగంగా వివిధ వాటాదారులతో కలిసి పనిచేయటం, డేటా సొల్యూషన్‌లను అందించడం వంటి బాధ్యతల గురించి వెల్లడించింది. దక్షిణ భారత అభ్యర్థులను లక్ష్యంగా చేసుకున్న మినహాయింపు నిబంధనకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‍లో స్క్రీన్‌షాట్ షేర్ చేయబడిన తర్వాత నియామక పద్ధతులలో వివక్ష గురించి విస్తృత చర్చ కొనసాగుతోంది.
దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే జాబ్ పోస్టులో రిక్రూటింగ్ సంస్థ హిందీ రాయటం, మాట్లాడటంపై పట్టు ఎక్కువగా ఉండాలని కోరినందున దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మినహాయించిందని ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరో వ్యక్తి స్పందిస్తూ ప్రస్తుతం సౌత్ ఇండియన్స్ కూడా ప్రస్తుతం హిందీ మాట్లాడటం, రాయటంలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారని, అయితే చివరిలో రిక్రూటింగ్ సంస్థ ప్రత్యేకంగా నోట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని అభఇప్రాయపడ్డారు. మరికొందరైతే ప్రత్యేకంగా నిషేధం సరైనది కాదని సరైన స్కిల్స్ ఉన్న ఎవ్వరినైనా కంపెనీ రిక్రూట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నందున ఇలా వివక్ష చూపటం సరైనది కాదని పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సౌత్ సూపర్..
దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఎగుమతులను వివిధ టెక్నాలజీ పార్కుల నుంచి ఎంత ఉందనే వివరాలను పరిశీలిస్తే.. టాప్-10 స్థానాల్లో తొలి స్థానంలో బెంగళూరు రూ.4.07 లక్షల కోట్ల ఎగుమతులను కలిగి ఉంది. ఇక రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ రూ.1.21 లక్షల కోట్లు, పూణే రూ.1.05 లక్షల కోట్లు, చెన్నై రూ.77.42 వేల కోట్లు, ముంబైలో రూ.76.56 వేల కోట్లు, గురుగ్రాము రూ.52.93 వేల కోట్లు, నోయిడా రూ.50.11 వేల కోట్లు, కలకత్తా రూ.13.02 వేల కోట్లు, గాంధీనగర్ రూ.8.63 వేల కోట్లు, తిరువనంతపురం రూ.5.31 వేల కోట్ల ఎగుమతులను కలిగి ఉన్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications