నోయిడాలో చోటు చేసుకున్న ఒక వింత సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ న్యూస్ గా మారింది. 20 ఏళ్ల యువకుడి బ్యాంక్ ఖాతాలో ఎవరూ ఊహించని స్థాయిలో నగదు జమ అయింది. ఆ ఖాతాలో జమ అయిన మొత్తం మనం లెక్కపెట్టడానికి చాలా కష్టం. ఇంతకీ ఆ ఖాతాలో ఎంత జమ అయిందని అనుకుంటున్నారా.. అక్షరాలా..రూ. 1 సెప్టిలియన్ ట్రిలియన్ కంటే ఎక్కువ.. దాదాపు రూ. 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299.. ఈ నంబర్లు చూస్తే దిమ్మ తిరుగుతోంది కదా.. మరి అ అకౌంట్ ఖాతాదారుడు కూడా ఒక్కసారిగా అంత మొత్తం జమ కావడం చూసి షాకయ్యాడు.
వైరల్ న్యూస్ లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన దీపక్ అనే యువకుడికి ఎదురైన అనుభవం ఇది. ఆ కుర్రాడు ఇటీవల మరణించిన తన తల్లి గాయత్రి దేవి పేరిట ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ పొదుపు ఖాతాను నిర్వహిస్తున్నాడు.ఆగస్టు 3 రాత్రి అతనికి మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయంటూ ఒక మెసేజ్ వచ్చింది. అయితే అది నామమాత్రంగా ఏ లక్షలో, కోట్లో కాదు..మనం లెక్కలు కూడా వేయలేని నంబర్..మొత్తం 37 అంకెల సంఖ్యతో కూడిన నంబర్ వచ్చింది.

ఇంత పెద్ద మొత్తం ఖాతాలో జమ కావడం చూసి అతను ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే తన స్నేహితులకు ఆ నంబర్ మెసేజ్ చేశాడు. ఇది ఎంత అమౌంట్ లెక్కల్లో తెలుపండి. నాకు లెక్కలు రావంటూ పంపాడు.జర్నలిస్ట్ సచిన్ గుప్తా దృష్టికి ఇది వెళ్లింది, అతను ఈమెసేజ్ తన X (మాజీ ట్విట్టర్) ఖాతాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్యాంకుకు వెళ్లిన దీపక్ అక్కడ ఖాతా అధికారులకి ఈ విషయాన్ని తెలిపాడు. వారు కూడా మొదట ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే తేరుకుని అతని ఖాతాను ఫ్రీజ్ చేశారు. వెంటనే ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department)దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు దీనిపై విచారణ ప్రారంభమైందని తెలుస్తోంది.
అతని ఖాతాలో పడిన మొత్తం భూమి మీద ఎప్పుడైనా ఏ వ్యక్తి ఖాతాలో కనిపించిన అత్యధిక మొత్తాల్లో ఒకటి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది ఈ మొత్తాన్ని ఎలా లెక్కించాలో చర్చిస్తున్నారు. మరికొందరు దీపక్ ఇప్పుడు అంబానీ కంటే పెద్ద ధనవంతుడు అయ్యాడంటూ హాస్యంగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇది బ్యాంకు సాఫ్ట్‌వేర్ లోపమా? మాన్యువల్ ఎంట్రీ పొరపాటా? లేక ఏదైనా మనీలాండరింగ్ కేసా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అధికారుల ప్రాథమిక విచారణలో ఇది సాంకేతిక లోపంగా కనిపిస్తున్నా..నిధుల మూలం పూర్తి దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని అధికారులు తెలిపారు.
ఇక దీపక్ విషయానికొస్తే.. ఈ విషయం తర్వాత అతనికి వస్తున్న ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మెసేజ్‌లు భరించలేక తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.అకస్మాత్తుగా వచ్చిన ఈ విపత్తు అతనికి నిద్ర లేకుండా చేసింది. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటల్ లోపాలపై చర్చకు ఇది ఇప్పుడు వేదికగా మారింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications