ఇండియాలో పర్సనలైజ్డ్ వేగవంతమైన రవాణా వ్యవస్థను నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పొందనుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న పాడ్ టాక్సీ ట్రాన్సిట్ సిస్టమ్.. ఎయిర్ పోర్టుని ఫిల్మ్ సిటీతో అనుసంధానిస్తుంది. వీటిని ఇప్పటికే లండన్, సింగపూర్, దుబాయ్ వంటి విమానాశ్రయాల్లో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ కు తొలి పాడ్ టాక్సీ సేవను అందించడానికి యమునా అథారిటీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

పాడ్ టాక్సీలు డ్రైవర్ లేకుండా పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు. ఇవి స్వయంప్రతిపత్త కలిగిన చిన్న వాహనాలు. నిర్ణీత మార్గంలో ఒకేసారి 4-6 మంది ప్రయాణికులను మాత్రమే రవాణా చేయగలవు. కానీ చాలా వేగంగా నడుస్తాయి. వీటి కోసం ప్రత్యేక ట్రాక్‌లు కేటాయిస్తారు. వీటి ద్వారా కార్లు ఛార్జ్ అవుతాయి.
స్వయంప్రతిపత్త పాడ్ టాక్సీ.. జెవార్ విమానాశ్రయం మరియు ఫిల్మ్ సిటీ (సెక్టార్ 21) మధ్య నడుస్తుంది. ఈ ట్రాక్ దాదాపు 14 కిలోమీటర్ల పొడవు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. హ్యాండీక్రాఫ్ట్ పార్క్, అపెరల్ పార్క్, సెక్టార్ 33, టాయ్ పార్క్, సెక్టార్ 32, MSME పార్క్ మరియు సెక్టార్ 29 వంటి ప్రదేశాలను ఇది కవర్ చేస్తుంది. మొత్తం 810 కోట్లతో ఈ విధానాన్ని అభివృద్ధి చేయాలని అంచనా.


Click it and Unblock the Notifications