Tata Group: రతన్ టాటా మరణించి వారం కూడా పూర్తి కాకమునుపై టాటా గ్రూప్ వరుసగా పెద్ద ప్రకటనలతో పాటు, భారీ విజయాలను సైతం సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ప్రస్తుతం దలాల్ స్ట్రీట్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయారు. పైగా షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ సైతం ఈయన రాకతో సంతోషంగానే ఉంది. ఇదే క్రమంలో మరో పెద్ద అడుగు వేసేందుకు నోయెల్ టాటా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి అంతర్గతంగా కొన్ని మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
టాటా ట్రస్ట్‌కు కొత్తగా నియమితులైన నోయెల్ టాటా, టాటా సన్స్ బోర్డులో చేరబోతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా నివేదించింది. వాస్తవానికి టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్.. దీనిలో టాటా ట్రస్ట్స్ 66 శాతం వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కొత్తగా నియమితులైన తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ రెండింటి బోర్డుల్లో కుటుంబం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఏకైక వ్యక్తిగా నోయెల్ టాటా కొనసాగుతున్నారని తెలుస్తోంది. వేణు శ్రీనివాసన్, విజయ్‌సింగ్‌తో పాటు టాటా సన్స్ బోర్డులో ట్రస్ట్‌కు నామినేట్ చేసిన ముగ్గురిలో నోయెల్ టాటా ఒకరుగా ఉంటారని నివేదిక పేర్కొంది. అయితే ఏకకాలంలో రెండింటిలో కొనసాగవచ్చా లేదా అనే అంశంపై ప్రస్తుతం ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రతన్ టాటా మరణం తర్వాత అక్టోబర్ 11న టాటా ట్రస్ట్స్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే నాన్-ఎగ్జిక్యూటివ్ రోల్ ఉన్నందున కొన్ని గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా నోయెల్ కొనసాగడంపై ఎటువంటి నిషేధం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌కు ఏది ఉత్తమమో తెలుసుకోవడానికి టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌కు కొంత సమయం పడుతుందని అంతర్గత వర్గాల నుంచి సమాచారం. అయితే రెండు పాత్రల్లో ఇకపై కొనసాగుతారా లేదా అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
తొలి విజయం నమోదు..
సెప్టెంబరు త్రైమాసికంలో డీమార్ట్ పేరెంట్ కంపెనీ అవెన్యూ సూపర్ మార్కెట్లలో షేర్లు భారీగా క్షీణతను చూసిన సంగతి తెలిసిందే. నేడు ఇంట్రాడేలో కొంత పుంజుకున్నాయి. తాజాగా రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని డీమార్ట్ కంపెనీని టాటాలకు చెందిన ట్రెంట్ అధిగమించింది. ప్రస్తుతం ట్రెంట్ కంపెనీ మార్కెట్ విలువ రూ.2.93 లక్షల కోట్లుగా ఉండగా.. అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ క్యాప్ రూ.2.73 లక్షల కోట్ల వద్దకు దిగజారింది. ప్రస్తుతం ఈ వార్త స్టాక్ మార్కెట్లతో పాటు వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications