టెక్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నా స్మార్ట్‌ఫోన్‌లకు నో.. శాంసంగ్ వారసుడు లిమ్ డాంగ్-హ్యూన్ సక్సెస్ స్టోరీ..

భారత్ అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్.. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే బతకడం చాలా కష్టం. ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో గుర్తు పెట్టుకోవడం అనేది మరచిపోయారు. ప్రతిదీ స్మార్ట్ ఫోన్ గుర్తు చేస్తోంది. అయితే మూడేళ్ల పాటు స్మార్ట్ ఫోన్ లేకుండా బతికితే ఎలా ఉంటుంది. ఎవరైనా ఊహించుకున్నారా.. ఆ ఆలోచన తలుచుకుంటే బాబోయ్ నా వల్ల కాదు అని అనిపిస్తుంది కదా..

అయితే ఓ యువకుడు మూడేళ్ల పాటు స్మార్ట్ ఫోన్ లేకుండా గడిపాడంటే నమ్మగలరా.. అది కూడా ఓ దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ చైర్మెన్ అధినేత అంటే ఇంకా షాకవుతారు.. అవును మీరు విన్నది నిజం.. ఇప్పుడు దక్షిణ కొరియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ (SNU)లో గత డిసెంబర్‌లో ప్రవేశం పొందిన ఒక యువకుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కేంద్రం బిందువుగా మారాడు.

Samsung scion Samsung heir Samsung family member no smartphone for 3 years smartphone ban digital detox Samsung heir education Korea top university South Korea elite university Korean university admission study discipline focus and concentration student success story exam preparation South Korea screen time impact smartphone addiction digital detox benefits education and technology Samsung news lifestyle success story amp amp amp amp

ఆ యువకుడి పేరే లిమ్ డాంగ్-హ్యూన్.హోటల్ షిల్లా అధ్యక్షురాలు లీ బూ-జిన్ కుమారుడు, అంతే కాకుండా దివంగత Samsung మాజీ చైర్మన్ లీ కున్-హీ మనవడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వారసుడైనప్పటికీ.. ఆయన సాధించిన విద్యా విజయం వెనుక ఉన్న క్రమశిక్షణ, త్యాగం ఇప్పుడు అనేక మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.

ప్రైవేట్ విద్యా రంగానికి చెందిన వర్గాలు, ప్రముఖ మైల్ బిజినెస్ వార్తాపత్రిక నివేదికల ప్రకారం.. లిమ్ ఇటీవల సియోల్‌లోని డేచి-డాంగ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ క్రామ్ స్కూల్‌లో అతిథి వక్తగా పాల్గొన్నారు. అక్కడ విమూన్ హై స్కూల్ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన బ్రీఫింగ్ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో నేను ఎలా అడ్మిషన్ పొందాననే అంశంపై తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.

లిమ్ తన ప్రసంగంలో ప్రధానంగా కొరియన్ కాలేజ్ స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్ (CSAT)కి సిద్ధమయ్యే విధానంపై విలువైన సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఆయన చేసిన అత్యంత ఆసక్తికరమైన సిఫార్సు ఏమిటంటే.. మూడు సంవత్సరాల పాటు స్మార్ట్‌ఫోన్‌లను పూర్తిగా వాడకపోవడం. ఇది సులభమైన నిర్ణయం కాదని అంగీకరిస్తూనే.. దీని వల్ల తన దృష్టి, ఏకాగ్రత గణనీయంగా మెరుగుపడిందని లిమ్ స్పష్టం చేశారు.

ఈ సెషన్‌లో A Regret-Free Whimoon High School Life అనే శీర్షికతో ఒక ప్రెజెంటేషన్ కూడా నిర్వహించారు. ఇందులో ఆయన తాను పరిష్కరించిన పరీక్షా ప్రశ్నల ఉదాహరణలను చూపిస్తూ.. సమస్య పరిష్కార విధానాన్ని వివరించారు. అంతేకాకుండా, పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రశ్నోత్తరాల సెషన్ కూడా జరిగింది.

విషయాల వారీగా తన సిద్ధాంత విధానాన్ని వివరించిన లిమ్.. కొరియన్ భాషా విభాగంలో ఖచ్చితమైన పఠన గ్రహణశక్తి అత్యంత కీలకమని చెప్పారు. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను పదే పదే సాధన చేయడం అవసరమని సూచించారు. మాక్ పరీక్షలు రాయడం ఉపయోగకరమే అయినా.. తార్కికంగా బలహీనంగా రూపొందించిన ప్రశ్నల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

గణితంలో విశ్లేషణాత్మక తార్కికం అవసరమయ్యే ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లిమ్ సూచించారు. ముఖ్యంగా విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే జూన్, సెప్టెంబర్ మాక్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు విద్యార్థులు తమ స్వంత పరిష్కార పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఇందుకోసం ఎక్కువ సంఖ్యలో సమస్యలను పరిష్కరించడం ద్వారా మంచి ప్రవృత్తి ఏర్పడుతుందని వివరించారు. అలాగే స్వీయ నియంత్రణ (self-discipline) ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెప్పారు. మూడేళ్లపాటు స్మార్ట్‌ఫోన్‌లు, వీడియో గేమ్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని బలంగా సూచించారు.

ఇది చాలా కష్టమైన నిర్ణయమే, కానీ ఇది దృష్టిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. చదువులో పూర్తిగా లీనమయ్యేలా చేస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత అది ముగిసినప్పుడు కలిగిన ఆనందాన్ని నేను నిజంగా ఆస్వాదించానని ఆయన అన్నారు. లిమ్ 2026 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్ ట్రాక్ కింద గత డిసెంబర్‌లో SNUలోని ఎకనామిక్స్ విభాగంలో చేరారు. CSATలో అత్యంత అధిక స్కోర్లు సాధించే ముందు.. మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఆయన ఎల్లప్పుడూ అగ్రశ్రేణి గ్రేడ్‌లను కొనసాగించారు.

ఇదే విశ్వవిద్యాలయంలో ఆయన మామ, ప్రస్తుత శామ్‌సంగ్ చైర్మన్ లీ జే-యోంగ్ కూడా సుమారు 39 సంవత్సరాల క్రితం చదువుకున్నారు. ఆయన ఆసియా చరిత్రలో ప్రత్యేకత సాధించడం విశేషం. ఇలా ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల విద్యా ప్రయాణం ఇప్పుడు కొరియా విద్యా వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+