Rs 50 coin Latest News: గత కొన్ని రోజులుగా రూ.50 నాణెం వస్తుందంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. తాజాగా 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓ కేసు విచారణలో భాగంగా.. ప్రస్తుతం రూ.50 నాణెం ప్రవేశపెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఏమీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ప్రజలు భారీ నాణేలకంటే నోట్లనే ఇష్టపడతారని, అందుకే కొత్త నాణెంపై ప్రణాళిక లేదని తెలిపింది.
న్యాయవాది రోహిత్ దండరియాల్ దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా ఆర్థిక శాఖ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అంధుల కోసం ప్రత్యేకంగా రూ.50 నాణెం విడుదల చేయాలని ఆయన కోర్టు ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.దానికి స్పందిస్తూ మంత్రిత్వ శాఖ 2022లో ఆర్‌బీఐ చేసిన సర్వేను ప్రస్తావించింది. ఆ సర్వే ప్రకారం ప్రజలు నాణేల బరువు, పరిమాణం, గుర్తింపు ఇబ్బందుల వల్ల వాటిని ఎక్కువగా ఉపయోగించడం లేదు. వారంతా నోట్లను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. రోజువారీ లావాదేవీలకు అవే అనుకూలంగా ఉంటాయని తేలిందన్నారు.

ఇక తన పిటిషన్లో న్యాయవాది దండరియాల్.. 50 రూపాయల నోటులో స్పర్శ లక్షణాలు లేకపోవడం వల్ల అంధులకు దాన్ని గుర్తించడం సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. ఇతర నోట్లలో ఉండే ఎంబోస్డ్ ప్రింటింగ్, వేరే పరిమాణాలు 50 రూపాయల నోటులో లేకపోవడం వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి అంధుల కోసం ప్రత్యేకంగా రూ.50 నాణెం విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ అనీష్ దయాల్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ మీద స్పందించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్రం కోర్టుకు తన అఫిడవిట్ ద్వారా తెలిపింది. నోట్ల వినియోగం రోజువారీ లావాదేవీల్లో సులభతరం కావడంతో ప్రజలు వాటిని ఇష్టపడుతున్నారు.
కొత్త నాణెం ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వం ప్రజల అభిప్రాయం, అవసరాలు, ఆర్థిక ప్రభావాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 నాణెం అవసరం లేదని కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. దీనిపై స్పందించేందుకు పిటిషనర్‌కు సమయం ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం పాత, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు కలిపి వాడుతున్నందున దృష్టి లోపం ఉన్న వారికి కొంత గందరగోళం ఏర్పడుతున్న మాట వాస్తవమే. అయితే ఎక్కువ నోట్లపై ఉన్న ప్రత్యేకతలు అంధులకు సాయపడుతున్నాయని కూడా ప్రభుత్వం గుర్తించింది. కానీ ప్రత్యేకంగా రూ.50 నోటులో మాత్రం అలాంటి లక్షణం లేనందున ఇది సమస్యగా మారిందని తెలిపింది.
ఏదేమైనా ప్రస్తుతం రూ.50 నాణెం ప్రవేశపెట్టే అవసరం లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించినప్పటికీ, అంధుల అవసరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై తుదినిర్ణయం సెప్టెంబర్ 17 విచారణ తర్వాత వెలువడే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications