రైల్వే ప్రయాణంలో వివిధ కేటగిరీలకు అందించే రాయితీలపై రైల్వే శాఖ మంత్రి శనివారం కీలక ప్రకటన చేశారు. రాయితీలను ఎప్పుడు పునరుద్ధరించాలనే అంశంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైల్వే టిక్కెట్ల పైన రాయితీలు ఉండవని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్నట్టుగా పూర్తి ఛార్జీ ఉంటుందని తెలిపారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో రైల్వే శాఖ గత ఏడాది ప్రయాణ రాయితీలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ రాయితీలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే అంశానికి సంబంధించి శుక్రవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. రాయితీలు ఇప్పుడే పునరుద్ధరించే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చిలో రైల్వేశాఖ దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. ఆ తర్వాత రైళ్లను ప్రారంభించింది. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తోంది. దీంతో ఈ రైళ్లలో రాయితీలు వర్తించడంలేదు. రైల్వే శాఖ ఆర్మీ, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 51 కేటగిరీలలో రాయితీలు అందిస్తోంది. ప్రస్తుతం ఇందులో దివ్యాంగులు, స్టూడెంట్స్, రోగులకే రాయితీలు వర్తిస్తున్నాయి. మిగిలిన కేటగిరీలకు ఫుల్ ఛార్జీని వసూలు చేస్తోంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో టిక్కెట్ కన్సెషన్‌ను రద్దు చేశారు. 'కరోనా, కోవిడ్ ప్రొటోకాల్ దృష్ట్యా అన్ని వర్గాల ప్రయాణీకులకు (దివ్యాంగుల 4 కేటగిరీలు, 11 కేటగిరీల రోగులు, విద్యార్థులు మనహాయించి) రాయితీని మార్చి 20, 2020 నుండి ఉపసంహరించారు. ప్రస్తుతం రాయితీలను పునరుద్ధరంచే ఉద్దేశ్యం లేదు' అని కేంద్రమంత్రి తెలిపారు.
రైల్వే శాఖ 51 వివిధ రకాల రాయితీలను అందిస్తోంది. ఇందులో సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ పైన యాభై శాతం రాయితీ అందిస్తోంది. ఇది అన్ని రైళ్లలో ఉంటుంది. ఇందులో సీనియర్ సిటిజన్లకు అన్ని రైళ్లలో టిక్కెట్ పైన 50 శాతం రాయితీ ఉంటుంది. దీంతో పాటు టీచర్స్, వార్ విడోస్, అవార్డు గ్రహీతలు, ఆర్టిస్టులు, క్రీడాకారులు, రైతులు, మెడికల్ ప్రొఫెషనల్స్.. ఇలా ఎందరికో రాయితీ అందిస్తోంది.


Click it and Unblock the Notifications