ఓటీపీ లేకుండా 60 నిమిషాల్లో రూ. 78 లక్షలు మాయం.. కొత్త మోసపూరిత పద్దతులతో షాకిస్తున్న కేటుగాళ్లు..

ముంబైలో షాకింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఓ గోల్డ్ లోన్ సంస్థ సైబర్ మోసగాళ్ల బారిన పడి కేవలం 60 నిమిషాల్లో రూ.78 లక్షలు కోల్పోయింది. దీనికి సంబంధించిన ఘటన ముంబై వాసులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆశ్చర్యకరంగా ఈ లావాదేవీల సమయంలో OTP కూడా రాలేదని బాధిత సంస్థ తెలిపింది. ఈ ఘటనతో సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న కొత్త మోసపూరిత పద్ధతులు, కార్పొరేట్ బ్యాంకింగ్ భద్రత, డిజిటల్ చెల్లింపుల రిస్క్‌లపై మళ్లీ చర్చ మొదలైంది.

ముంబైలోని పరేల్‌కు చెందిన ఒక ప్రముఖ బంగారు రుణ సంస్థ సైబర్ నేరగాళ్ల దాడికి గురై రూ. 78.1 లక్షల నిధులను కోల్పోవడం నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. జూలై 13న కేవలం గంట వ్యవధిలోనే సంస్థకు చెందిన కరెంట్ ఖాతా నుండి 18 అనధికారిక లావాదేవీల ద్వారా నిధులను ఇతర ఖాతాలకు మళ్లించారు. జూలై 17న ముంబై సెంట్రల్ సైబర్ పోలీసులు ఈ ఘటనపై అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Cyber Fraud No OTP Scam Mumbai Gold Loan Firm 78 Lakh Fraud Gold Loan Scam Online Banking Fraud Cyber Crime Digital Fraud Banking Security Financial Scam Business News OTP 78

ఈ సైబర్ దాడిలో నేరగాళ్లు సంస్థ యొక్క ఓమ్నిఫిన్ లోన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS) దాని అనుసంధానిత చెల్లింపు వ్యవస్థను ఛేదించారు. సదరు సంస్థ పేస్ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వార బ్యాంకింగ్ వ్యవస్థతో ఏపీఐ (API) ఆధారిత అనుసంధానాన్ని కలిగి ఉంది. ఈ వ్యవస్థలో రుణం ఆమోదం పొందిన వెంటనే మనుషుల ప్రమేయం లేదా ఓటీపీ (OTP) అవసరం లేకుండానే నేరుగా బ్యాంకుకు చెల్లింపు సూచనలు వెళతాయి. దాడి చేసినవారు ఈ ఏపీఐ లొసుగులను, సంస్థ అంతర్గత సిస్టమ్‌లను తారుమారు చేసి.. నకిలీ రుణ అభ్యర్థనలను నిజమైనవిగా సృష్టించి బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా నిధులను ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యేలా చేశారు.

Also Read

ఈ మళ్లించిన నిధులు రూ. 2 లక్షల నుండి రూ. 7 లక్షల చొప్పున జమ్మూ & కాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాల్లోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. జూలై 14న సాధారణ రికన్సిలియేషన్ (ఖాతాల తనిఖీ) ప్రక్రియలో కంపెనీ ఈ అవకతవకలను గుర్తించింది. తదనంతరం జూలై 16న జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 ద్వారా ఫిర్యాదు చేసి.. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం సదరు లబ్ధిదారుల ఖాతాలను స్తంభింపజేయాలని నిరోధక చర్యలు తీసుకున్న పోలీసులు. ఈ మోసంలో కంపెనీ లేదా బ్యాంకు అంతర్గత ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+