ఏదైనా మని ట్రాన్సాక్షన్ లేదా ఆన్ లైన్ వెరిఫికేషన్ ఇంకా ఇతర వాటికోసం ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) ఫెసిలిటీ ఉండేది. కానీ తాజాగా ఓటీపీకి చెక్ పెడుతూ మొబైల్ యూజర్ల కోసం ఒక షాకింగ్ న్యూస్ వెలువడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) దీనికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసింది. కమర్షియల్ మెసేజెస్ అండ్ OTPకి సంబంధించిన ట్రేస్బిలిటీ రూల్స్ పై TRAI కీలక నిర్ణయం తీసుకుంది.
అనవసరమైన కమర్షియల్ మెసేజెస్, ఫిషింగ్ దాడులు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో TRAI ఓటీపీలకి చెక్ పెడుతున్నట్లు తెలిపింది. అలాగే కమర్షియల్ మెసేజెస్ నియంత్రించడం చాలా ముఖ్యం అని వెల్లడించింది. ఈ మెసేజెస్ స్మార్ట్ ఫోన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇంకా బ్యాంకింగ్ వివరాలు, ఇతర సమాచారం యాక్సెస్ చేసే విధంగా ఉంటున్నాయి, దీని వాళ్ళ ప్రజలు ఎంతో ఆర్ధిక నష్టాలను చూడాల్సి వస్తుంది.

అయితే డిసెంబరు 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. TRAI OTP మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేయడానికి టెలికాం కంపెనీలకు అక్టోబర్ 30 వరకు సమయం ఇచ్చింది. దేశంలోని టెలికాం ఆపరేటర్లు Jio, Airtel, Vi ఇంకా BSNL ఉన్నాయి. నవంబర్ 30 తర్వాత టెలికాం కంపెనీలు కమర్షియల్ మెసేజెస్, OTP మెసేజెస్ ట్రాక్ చేయడానికి ట్రేసబిలిటీ రూల్స్ అమలు చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ రూల్స్ అన్ని టెలికాం కంపెనీలు కచ్చితంగా అమలు చేయాలని ట్రాయ్ నిర్ణయించింది. కానీ ఇప్పటికీ చాలా టెలికాం కంపెనీలు ఈ మార్పులను ఒప్పుకునేందుకు రెడీగా లేవు. అయినాసరే TRAI ఈ సమస్యను సీరియస్‌గా తీసుకొని ఈ నిబంధనలను అమలు చేయాలని పట్టుబట్టింది. ఒకవేళ Jio, Airtel, Vi, BSNL డిసెంబర్ 1 నుండి ట్రేసబిలిటీ నియమాన్ని అమలు చేస్తే OTP మెసేజులు రావడానికి ప్రస్తుతం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.
ఈ నియమాన్ని అమలు చేసిన తర్వాత మీరు మీ బ్యాంకింగ్, ఏదైనా రిజర్వేషన్ బుకింగ్, వెరిఫికేషన్ మొదలైన వాటిలో OTP కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చు. ఈ నిబంధన అమలుతో స్కామర్లు నకిలీ OTP మెసేజెస్ ద్వారా ప్రజలను హ్యాకింగ్, ఫిషింగ్, బ్యాంకింగ్ వివరాలు, పర్సనల్ డేటా లాంటివి యాక్సెస్ చేయలేరు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరింత భద్రత లభిస్తుంది.
అయితే ఓటీపీ ద్వారా ఎదురయ్యే సమస్యలు చాలానే ఉన్నాయి. ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక అన్ని స్మార్ట్ గా అరచేతిలో జరిగిపోతున్నాయి. ఓటీపీ రావడంలో ఆలస్యం అయితే బ్యాంక్ ట్రాన్సక్షన్స్, ఆన్ లైన్ బుకింగ్, నెట్ బ్యాంకింగ్, ఆన్ లైన్ పేమెంట్స్, డేటా వెరిఫికేషన్, ఆన్ లైన్ అప్లికేషన్స్ సహా చాల వరకు అన్ని స్తంభించిపోయే ప్రమాదం ఉంది. దీని పై టెలికాం కంపెనీలు ప్రత్యామ్నాయం ఏదైనా సూచనలు చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications