ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో ఉద్యోగ భవిష్యత్తు ఎలా మారిపోతుందోనన్న సందేహాలు, ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టెక్నాలజీ కారణంగా ఉద్యోగాలు పోతాయా? లేక కొత్త అవకాశాలు వస్తాయా? అనే చర్చకు కర్ణాటక రాష్ట్రం తనదైన సమాధానాన్ని చెప్పింది. "AI వల్ల వచ్చే మార్పులు తాత్కాలికమే, అయితే వాటికి సిద్ధంగా ఉండాలి" అని స్పష్టం చేసింది. ఆ దిశగా రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీసుకుంటున్న పలు కీలక చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

"స్కిల్లింగ్ ద్వారా ఉద్యోగ భద్రతను నూతనంగా అభివృద్ధి చేయాలి" అనే దృష్టితో, "నిపుణ కర్ణాటక" పథకం ద్వారా లక్షలాది మందికి ట్రైనింగ్ ఇవ్వాలని వారు ప్రకటించారు. AI ఆటంకాలకి భయపడకూడదని, అవకాశాలను పట్టు చేసుకోవాలనేదే ఆయన సందేశం.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?
ఈ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇలా ఇచ్చారు "కొద్దిపాటి కాలం పాటు ఆందోళనలు ఉండవచ్చు. కొన్ని ఉద్యోగాలు పోవచ్చు. కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. అందుకే మేము పెద్ద స్థాయిలో స్కిల్లింగ్ కార్యక్రమం చేపట్టాం. ప్రజల్ని ట్రెయిన్ చేసి మళ్లీ ఉద్యోగ రంగంలోకి తీసుకురావడమే లక్ష్యం."
ఏఏ రంగాల్లో శిక్షణ?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు. ఈ రంగాల్లో వచ్చే సంవత్సరం ఐదున్నర లక్షల మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్న స్కిల్ కౌన్సిల్ ద్వారా పరిశ్రమల అవసరాలు తెలుసుకొని, వారికే అవసరమైన మానవ వనరులు అందించాలనుకుంటున్నారు.
ప్రియాంక్ ఖర్గే తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 20,000 స్టార్టప్‌లు కర్ణాటకలో నమోదయ్యాయి. దేశంలో ఉన్న 110 యూనికార్న్‌లలో 45 పైగా బెంగళూరునే కేంద్రంగా ఉన్నాయి. బయో ఎకానమీకి దేశ వ్యాప్తంగా 21% కర్ణాటక నుంచి వస్తోంది. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీకి 65% కర్నాటక నే కేంద్రం. దేశంలోని మొత్తం జీసీసీ (Global Capability Centers)ల్లో 800 పైగా కర్ణాటకలో ఉన్నాయి.
కేవలం ప్రకటనలకే కాకుండా నిజమైన ఫలితాలకే పాలసీలు రూపొందిస్తున్నామని మంత్రి ఖర్గే చెప్పారు. అందులో భాగంగా ఇటీవల "కర్ణాటక క్వాంటం రోడ్‌మ్యాప్" ప్రకటించారు. అలానే అగ్రిటెక్ నుంచి స్పేస్‌టెక్ వరకు 25 కి పైగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నడుపుతున్నారు. ఇవి టెక్నాలజీ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు బలమైన మద్దతు ఇస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా పోటీగా ఉండటం మంచిదేనని ఖర్గే చెబుతున్నారు. కానీ బెంగళూరు ఇప్పటికీ టెక్, స్టార్టప్, జీసీసీ రంగాల్లో ముందుండడం గర్వ కారణమని అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఒక వినూత్న "AI వర్క్‌ఫోర్స్ ఇంపాక్ట్ స్టడీ"ని ప్రారంభించింది. ఇది రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగులపై AI ఎలా ప్రభావం చూపుతోంది, ఏ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది, ఏ కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయి వంటి అంశాలపై కీలకమైన సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ అధ్యయనం ద్వారా వచ్చే ఫలితాలు "నిపుణ కర్ణాటక" పథకం కింద నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి సహాయపడతాయి. లక్షలాది మంది నిపుణులను కలిగి ఉన్న బెంగళూరు, భారతదేశపు AI రాజధానిగా ఆవిర్భవించిన నేపథ్యంలో, ఈ అధ్యయనం ప్రజలు AI విప్లవంలో వెనుకబడకుండా చూసేందుకు ఉద్దేశించబడింది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications