దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో ప్రయాణం చేయాలంటే ప్రతిరోజు నరకమే. గంటల కొద్ది ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిందే. ఇంటి నుంచి బయలు దేరితే ఆఫీసుకు ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. అలాగే ఆఫీసు నుంచి బయటపడితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. ట్రాఫిక్ జామ్ తో నరకయాతన అనుభవించాల్సిందే. అయితే ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.
Bengaluru లోని కీలక ఐటీ హబ్ అయిన బెల్లందూర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. బెల్లందూర్ మెట్రో స్టేషన్ అభివృద్ధి కోసం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ Prestige Group, Bangalore Metro Rail Corporation Limited (BMRCL) మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద సుమారు రూ. 120 కోట్లకు పైగా పెట్టుబడితో మెట్రో స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు.

ఈ డీల్‌లో భాగంగా బెల్లందూర్ మెట్రో స్టేషన్‌కు త్వరలోనే Prestige Bellandur Metro Station అనే పేరు రానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందించడంతో పాటు, బెల్లందూర్-ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతంలో ఉన్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు కొంతమేర ఉపశమనం లభించనుంది. ఈ ఒప్పందం ప్రకారం Prestige Beta Projects Pvt Ltd కు 30 సంవత్సరాల పాటు Naming Rights లభించనున్నాయి.
ఈ కాలంలో స్టేషన్‌లో బ్రాండింగ్, ప్రకటనలు, కమర్షియల్ స్పేస్ నిర్వహణ వంటి అంశాలపై కంపెనీకి హక్కులు ఉంటాయి. మొత్తం పెట్టుబడిలో సుమారు రూ. 80 కోట్లు మెట్రో నిర్మాణ సంబంధిత పనులకు, మిగతా రూ. 40 కోట్లు స్టేషన్ అప్గ్రేడ్‌లు, ఆధునికీకరణ పనులకు వినియోగించనున్నారు.
బెల్లందూర్ మెట్రో స్టేషన్ బెంగుళూరులోని అత్యంత రద్దీగా ఉండే Outer Ring Road (ORR) ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఇది KR పూరం నుంచి సిల్క్ బోర్డ్ వరకు విస్తరించే 17 కిలోమీటర్ల బ్లూ లైన్ మెట్రో కారిడార్లో కీలక స్టేషన్‌గా ఉండనుంది. ఈ మార్గం నగరంలోని అనేక టెక్ పార్కులు, ఐటీ కంపెనీలు, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది. అందువల్ల రోజూ వేలాది ఐటీ ఉద్యోగులు ఈ మెట్రోను వినియోగించే అవకాశం ఉంది.
తాజా ప్రణాళికల ప్రకారం.. మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని Prestige Lakeshore Drive వంటి పెద్ద ఐటీ పార్కులకు నేరుగా చేరుకునేలా ఎలివేటెడ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ నిర్మించే అవకాశమూ ఉంది. దీని వల్ల 'మెట్రో నుంచి ఆఫీస్‌కు నిమిషాల్లో' అనే కాన్సెప్ట్ వాస్తవంగా మారనుంది.ఈ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్ ద్వారా BMRCLకు నాన్-ఫేర్ రెవెన్యూ గణనీయంగా పెరుగుతుంది. Naming Rights, కమర్షియల్ స్పేస్ లీజులు, ప్రకటనల ద్వారా మెట్రో సంస్థకు స్థిరమైన అదనపు ఆదాయం లభించనుంది. ఇదే మోడల్‌ను గతంలో యెల్లో లైన్‌లో ఇన్ఫీ ఫౌండేషన్, బయోకాన్, డెల్టా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు కూడా అనుసరించాయి.
బ్లూ లైన్ మొత్తం 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఈ స్టేషన్ ప్రారంభమైతే.. బెల్లందూర్-ORR ప్రాంతంలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ట్రాఫిక్ జామ్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ రూ. 120 కోట్ల మెగా ప్రాజెక్ట్‌తో బెల్లందూర్ ప్రాంతం ట్రాన్స్‌పోర్ట్ మ్యాప్ పూర్తిగా మారనుంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గడం, ఐటీ ఉద్యోగులకు వేగవంతమైన ప్రయాణం, BMRCLకు అదనపు ఆదాయం ఇలా అన్నింటికీ ఇది ఒక విన్-విన్ డీల్గా మారనుంది.
More From GoodReturns

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: బెంగళూరులో 9-5 షెడ్యూల్ అంటే ఇదే.. సోషల్ మీడియాలో టెక్కీ షేర్ చేసిన రియాలిటీ!

Bengaluru: బెంగళూరులో సామాన్యుడు బ్రతకగలడా? వైరల్ అవుతున్న టెక్కీ నెలవారీ ఖర్చుల చిట్టా!

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

ఫ్రిజ్‌లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..



Click it and Unblock the Notifications