SBI Magnum Children's Benefit Fund: ప్రతి ఒక్కరు పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ ఊహించని పరిస్థితుల్లో సబ్బు అవసరం అయితే లేదా మీ పిల్లల చదువుకు డబ్బు కావాలన్నా ఇబ్బందులను ఎదురుకోవాల్సిన వస్తుంది. పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తే ముఖ్యంగా మీ కూతురి పెళ్ళి కోసం డబ్బు ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఇక మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ కూతురి పెళ్ళికి సరిపోయేంత పెద్ద మొత్తంలో డబ్బును అందించే మ్యూచువల్ ఫండ్‌ను రూపొందించింది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా కనీసం 10 సంవత్సరాలు ఈ ఫండ్‌లో ఓపికగా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడమే. మీరు వరుసగా 10 సంవత్సరాలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఈ 10 సంవత్సరాల తర్వాత మీకు ఒకేసారి రూ.13 లక్షలు లభిస్తాయి. ఈ ఫండ్ పేరు SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్. అయితే ఈ ఫండ్ గురించి వివరంగా తెలుసుకోండి...

SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అంటే ఏంటి : SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అనేది పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా రూపొందించిన మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ పథకం పిల్లల చదువు, పెళ్లి సహా ఇతర భవిష్యత్తు అవసరాలలో ఉపయోగపడేందుకు, పెట్టుబడి పెట్టే వారికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందిస్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అప్షన్, అంతేకాదు పెట్టుబడిదారులకు మంచి రాబడి పొందేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఫండ్ ద్వారా ముఖ్యంగా ఈక్విటీ అండ్ డెబ్ట్ లో పెట్టుబడి పెడుతుంది, తద్వారా రాబడి వచ్చే అవకాశం పెరుగుతుంది.
కూతురి పెళ్ళికి ఈ స్కిం ఎలా ఉపయోగపడుతుందంటే : ముఖ్యంగా మీ కూతురి పెళ్ళికి ఈ స్కిం మంచి ఇన్వెస్ట్మెంట్ అప్షన్ కావచ్చు. ఎందుకంటే ఈ స్కింతో మంచి రాబడి పొందే అవకాశం ఉంది, అలాగే పెళ్ళికి అవసరమైన డబ్బు కూడబెట్టుకోవడానికి లాంగ్ టర్మ్ పెట్టుబడికి అనువైనది. మీరు మీ కూతురి పెళ్లి కోసం ఒక నిర్ణీత కాలంలో డబ్బును జమ చేయాలనుకుంటే ఈ స్కింలో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం కావచ్చు. అంతేకాదు పెట్టుబడిదారులు వారి అవసరాలకు అనుగుణంగా ఇందులో డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు.
SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ప్రాసెస్:
ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలంటే : పెట్టుబడిదారులు SBI మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
కెవైసి: ఇందుకు ముందుగా పెట్టుబడిదారులు కెవైసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇందులో వ్యక్తిగత సమాచారం, అడ్రస్ వెరిఫికేషన్ ఇంకా డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఎవాల్యుయేషన్ అండ్ సెలక్షన్ : KYC పూర్తి చేసిన తర్వాత పెట్టుబడిదారులు వారికీ నచ్చినంత డబ్బు లేదా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
పెట్టుబడి: పెట్టుబడిదారులు SI (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా లేదా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు:
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు అంటే ఈ ఫండ్ మొత్తం భారతీయ ప్రజలకు అలాగే సంస్థలకు అందుబాటులో ఉంది. అంతే కాకుండా, NRIలు (నాన్-రెసిడెంట్ ఇండియన్స్) కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
పెట్టుబడి పరిమితి: ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి కనీస పెట్టుబడి మొత్తం నెలకు రూ. 500 (SIP ద్వారా) అలాగే ఒకేసారి రూ. 5,000 పెట్టుబడిగా పెట్టొచ్చు. అంతేకాదు పెట్టుబడిదారులు తమకు నచ్చినంత మొత్తాన్ని కూడా పెట్టుబడి పెట్టవచ్చు, అయితే పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు.
SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ పై రాబడి: SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ రిటర్న్ రేటు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఫండ్ ఈక్విటీ అండ్ డెబ్ట్ రెండింటిలోనూ పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ చారిత్రాత్మకంగా 12-15% పరిధిలో రాబడిని ఇచ్చింది, కానీ ఈ రాబడి పరిస్థితులను బట్టి మారవచ్చు. ఈక్విటీ ఆధారిత పథకాలు కావడంతో రాబడి బంపర్‌గా కూడా ఉండవచ్చు కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ప్రతి నెలా లేదా ప్రతి సంవత్సరం ఎంత మొత్తం జమ చేయాలంటే : మీ కూతురి పెళ్ళి కోసం మీరు కనీస మొత్తాన్ని కూడబెట్టులనుకుంటే, ప్రతినెల మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఉదాహరణకు మీ కూతురి పెళ్లికి మీకు రూ.10 లక్షలు అవసరమనుకుందాం. మీకు 10 సంవత్సరాల టైం ఉంటే మీరు SIP ద్వారా ప్రతి నెలా రూ. 6,000-7,000 పెట్టుబడి పెట్టొచ్చు. ఈ ఫండ్ సగటున 12% వార్షిక రాబడిని ఇస్తే, ఈ మొత్తం 10 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.13 లక్షలకు పైగా అవుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడిని లెక్కించడానికి, మీరు SIP కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు, దీనితో సమయం, పెట్టుబడి మొత్తం ఇంకా మీ వచ్చే రాబడి ఆధారంగా అంచనా వేసిన రిటర్న్ మీకు తెలుస్తుంది.
మీ పెట్టుబడిపై మీకు రూ. 13 లక్షలు ఎ విధంగా లభిస్తాయాంటీ : మీ కూతురి పెళ్లి కోసం మీరు SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్‌లో 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా దాదాపు రూ.6,000 జమ చేస్తే, ఈ 10 సంవత్సరాలలో మీరు దాదాపు రూ.7.20 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ డిపాజిట్ మొత్తంపై సగటున 12% వార్షిక రాబడిని అందితే, మీకు వడ్డీగా దాదాపు రూ. 6,24,215 లభిస్తుంది. ఇప్పుడు మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ.7.20 లక్షలకు వడ్డీగా వచ్చిన రూ.6,24,215 మొత్తాన్ని కలిపితే, మీకు దాదాపు రూ.13,44,215 అందుతుంది. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు మీరు మీ డబ్బుతో మీ కూతురి పెళ్లి సులభంగా చేయవచ్చు. అంతేకాదు ఈ డబ్బును మీ కూతురి పైచదువులకు కూడా ఉపగించుకోవచ్చు. కానీ ఈ పెట్టుబడికి ముందుగా కొన్ని నియమాలు ఏంటో తెలుసుకోవాలి .
More From GoodReturns

SIP investment: రీల్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బులు గల్లంతే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications