ఈ రోజుల్లో ఆన్ లైన్ బుకింగ్స్ చాల వరకు పెరిగాయి. దింతో కొత్త కొత్త యాప్స్ కూడా సర్వీసెస్ అందించేందుకు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. కానీ గతంలో ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే స్వయంగా వెళ్లి ఏదైనా ఆటో మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఓలా, యుబర్, రాపిడో వంటి సర్వీసెస్ వచ్చాక ఆటోలకు ఒకప్పటిలాగా ఆదాయం ఉండట్లేదు. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక వార్త వెలువడింది. ఏంటంటే ఉబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఉబెర్ అప్లికేషన్'తో ప్రయాణీకులు దగ్గరలో ఉన్న ఆటోని ఈజీగా బుక్ చేసుకొని ప్రయాణించవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఉబర్ భారతదేశంలో ఆటో రిక్షా సేవలో ఓ మార్పును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఉబర్ ఆటోలు ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన పనిచేస్తాయని నివేదించింది. దీని అర్థం కస్టమర్లు చెల్లించే డబ్బు అంతా ఇప్పుడు ఆటో డ్రైవర్‌కు మాత్రమే వెళుతుంది.
ఈ విధంగా ఉబర్‌కు ఎటువంటి కమిషన్ రాదు. ఈ కొత్త సిస్టం కింద ఫిబ్రవరి 18 నుండి అన్ని ఉబర్ ఆటో ప్రయాణాలకు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. ఉబెర్ ఇండియా ప్రకారం, ఉబెర్ యాప్ యూజర్లు వారికీ సమీపంలో ఉన్న ఆటోలను బుక్ చేసుకోవడంలో సహాయపడుతుంది, అయితే ఉబెర్ ఈ సేవకు ఏ విధంగానూ బాధ్యత వహించదు. డ్రైవర్లు స్వతంత్రంగా పనిచేస్తారని, ఉబర్ పాత్ర డ్రైవర్లను ప్రయాణీకులతో అనుసంధానించడంతో ముగుస్తుందని అలాగే ఉబర్ దీనికి ఎటువంటి కమీషన్ వసూలు చేయదని కంపెనీ పేర్కొంది.

ఆటో-రిక్షా బుకింగ్‌లకు ఉబర్ ఎటువంటి క్యాన్సల్ చార్జెస్ కూడా వసూలు చేయదు. మీరు ఉబర్ యాప్‌లో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు, మీకు యాప్ ఛార్జీ మాత్రమే సూచిస్తుంది. కానీ రైడ్ మొత్తానికి ఛార్జ్ ఎంతో డ్రైవర్ అండ్ ప్రయాణికులు నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు ప్రయాణీకులు ఇంకా డ్రైవర్ల మధ్య ఛార్జీల సంబంధిత వివాదాలలో ఉబర్ జోక్యం చేసుకోదు. కస్టమర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చర్యతో కస్టమర్లు ఆటోకు క్యాష్ రూపంలో మాత్రమే చెల్లించవచ్చు. దీని అర్థం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఉబర్ అప్లికేషన్లు, ఉబర్ క్రెడిట్లు ఇంకా డిజిటల్ పేమెంట్ యాప్స్ పద్ధతులను ఉపయోగించలేరు.
మీ ఛార్జీ చెల్లింపులలో 100% నేరుగా డ్రైవర్‌కు వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు. నేను UPI ఉపయోగించి ఆటో డ్రైవర్‌కు చెల్లించవచ్చా ? దీనికి సమాధానం అవసరమైతే మీరు మీ ఆటో డ్రైవర్‌కు అతని/ఆమె ప్రాధాన్యత ప్రకారం చెల్లించవచ్చు. ఉబెర్ కస్టమర్లను ఆటోలతో అనుసంధానించడానికి ఒక వేదికను మాత్రమే అందిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, కస్టమర్ భద్రతా సమస్యలను కూడా పరిష్కరిస్తుందని భావిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications