ఇప్పటివరకు మనం UPIని కేవలం బిల్లులు చెల్లించడానికి, షాపింగ్‌కి లేదా స్నేహితులకు డబ్బులు పంపడానికి మాత్రమే వాడేవాళ్లం. కానీ త్వరలో అదే UPIతో మనం డబ్బులు ATM లాగా తీసుకోవచ్చని చెబుతున్నారు! UPIని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI , ఈ కొత్త సదుపాయం కోసం ఇప్పటికే RBI కి ప్రతిపాదన పంపింది.
NPCI ప్లాన్ ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షలకుపైగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ (BC) కేంద్రాల్లో QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చట. అంటే మన ఇంటి పక్క దుకాణంలో ఉన్న QR కోడ్ స్కాన్ చేసి, ATMకి వెళ్లకుండానే నగదు తీసుకోవచ్చన్నమాట!

కొత్తగా ప్రతిపాదించిన ఈ వ్యవస్థ పూర్తిగా మనకు తెలిసిన UPI పేమెంట్‌లాగే పనిచేస్తుంది. అంటే ఎటువంటి ప్రత్యేక పరికరాలు, ATM కార్డులు అవసరం ఉండవు. వినియోగదారు తన మొబైల్‌లోని UPI యాప్ ఓపెన్ చేసి, బ్యాంకింగ్ కరస్పాండెంట్ (BC) అందించే QR కోడ్‌ను స్కాన్ చేస్తాడు. తర్వాత పేమెంట్‌ను అథరైజ్ చేస్తే, ఆ మొత్తం వెంటనే వినియోగదారుడి బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది మరియు అదే సమయంలో BC ఖాతాకు జమ అవుతుంది. ఈ లావాదేవీ పూర్తయ్యాక, BC వినియోగదారునికి తగిన మొత్తాన్ని నగదుగా అందిస్తాడు.
ప్రస్తుతం ఈ విధానంలో ఒక్క ట్రాన్సాక్షన్‌కి గరిష్టంగా రూ. 1,000-రూ. 2,000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంది. కానీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన కొత్త సిస్టమ్ అమల్లోకి వస్తే, ఒక్కసారి రూ. 10,000 వరకు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇది అమలులోకి వస్తే, ATM వెతుక్కుంటూ తిరగకుండా పక్కనే ఉన్న BC సెంటర్‌లోనే పెద్ద మొత్తాన్ని కూడా సులభంగా, త్వరగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
గ్రామీణ మరియు అర్బన్-గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ కార్‌స్పాండెంట్లు ఇప్పటికే చిన్న చిన్న బ్యాంకుల్లా సేవలు అందిస్తున్నారు. వారు ప్రధానంగా ఆధార్ ఆధారిత సేవలు, మైక్రో ATMల ద్వారా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు వంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడీ నెట్‌వర్క్‌లో UPIని కూడా జతచేస్తే, ఫింగర్‌ప్రింట్ సమస్యల వల్ల బయోమెట్రిక్ వాడలేని వారు లేదా కార్డ్ మోసాల భయంతో ఉన్నవారు సాధారణ స్మార్ట్‌ఫోన్, UPI యాప్ సహాయంతో సులభంగా డబ్బు తీసుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఫైనాన్స్‌ను మరింత సులభతరం చేసి, నిజమైన గేమ్ చేంజర్‌గా మారే అవకాశముంది.
కానీ జాగ్రత్తలు తప్పనిసరి
ఇంత సులభంగా డబ్బు దొరికే సిస్టమ్‌ని మోసగాళ్లు కూడా టార్గెట్ చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని BC సెంటర్లు ఇప్పటికే సైబర్ మోసాలకు వాడబడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే, మోసాల దర్యాప్తుకు ఎలాంటి విధానము లేకపోవడం వల్ల BCల ఖాతాలు అనుమానం వచ్చిన వెంటనే ఫ్రీజ్ అవ్వడం, వారి జీవనోపాధి దెబ్బతినడం లాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే, ఈ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే ముందు భద్రతా చర్యలు కచ్చితంగా సిద్ధం కావాలని నిపుణులు అంటున్నారు.
ATMల కోసం లైన్‌లో నిలబడాల్సిన రోజులు మాయమయ్యే రోజులు దూరంలో లేవనిపిస్తోంది. మన ఫోన్‌లో ఉన్న UPI యాప్, రేపు మనకు పక్క దుకాణంలోనే ATMలా డబ్బు ఇస్తుందేమో చూడాలి! అది వస్తే మాత్రం... డబ్బు తీయడం కూడా ఆన్‌లైన్ షాపింగ్‌లా ఈజీ అయిపోతుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications