ఒక ఆటో డ్రైవర్ సాధారణంగా నెలలో ఎంత సంపాదిస్తాడు.. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మహా అయితే కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు. లేకుంటే ఓ యాభై వేలు అనుకుందాం..అయితే ఈ డ్రైవర్ ఏకంగా లక్షల్లో సంపాదన ఆర్జిస్తున్నాడు. అది కూడా ఆటోను ఉన్న చోటు నుండి కదల్చకుండా.. డ్రైవర్ లక్షల రూపాయలను ఆదాయంగా ఆర్జిస్తున్నాడు. ఈ డ్రైవర్ కథ వింటే మాత్రం అందరూ నోరు వెళ్లబెట్టాల్సిందే..
కథనంలోకి వెళ్తే...ముంబైలో ఓ ఆటో డ్రైవర్ నెలకు రూ. 5 నుండి రూ 8 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. అది కూడా ఉన్న చోటు నుండి ఆటో బయటకు తీయకుండా.. అతను సంపాదించే ఈ ఆదాయం నేడు ఎన్నో పెద్ద కంపెనీల డైరెక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు కూడా అందుకోలేని స్థాయిలో ఉంటుంది.సాఫ్ట్ వేర్లు కూడా ఆయన సంపాదించినంతగా అందుకోలేరంటే నమ్మి తీరాల్సిందే.. ఇంతకీ అ ఆటో డ్రైవర్ ఏమి చేస్తాడు. అంత డబ్బు ఎలా సంపాదిస్తాడనేగా మీ సందేహం..

ఈ ఆటో డ్రైవర్, ముంబైలోని అమెరికా కాన్సులేట్ వెలుపల తన ఆటోను నిలిపి అక్కడికి వచ్చే సందర్శకులకు ప్రత్యేకమైన సేవను అందిస్తున్నాడు. కాన్సులేట్ భద్రతా నియమాల ప్రకారం.. అక్కడి ఆఫీసులో బ్యాగ్‌లు తీసుకెళ్లేందుకు అనుమతించరు. ఇక ఏవైనా లాకర్లు, భద్రతా ఏర్పాట్లు లాంటి సదుపాయాలు కూడా అక్కడ లేవు. సందర్శకులు బ్యాగులు సేఫ్ గా ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గందరగోళంలో పడిన నేపథ్యంలో ఈ ఆటో డ్రైవర్ వినూత్నంగా పరిష్కారాన్ని ఆలోచించాడు.
ఈ డ్రైవర్.. సార్ నాకు మీ బ్యాగ్ ఇచ్చేయండి. మీరు వచ్చే వరకు భద్రంగా ఉంచుతాను. నా రోజు పనిలో ఇదొకటి. అయితే దీనికి రూ. 1,000 ఛార్జ్ ఉంటుంది," అంటూ అతను తన సేవను అందిస్తున్నాడు. చాలామంది ఎంబసీకి వచ్చిన వారు ఎటూ వెళ్లలేక చివరకు అతని వద్దే బ్యాగ్‌లను భద్రంగా ఉంచేస్తున్నారు. ఇలా రోజుకు 10-15 మంది కస్టమర్ల నుంచి కనీసం రూ. 10,000 వరకు సంపాదిస్తున్నారు.
ఈ డ్రైవర్ కథను లెన్స్‌కార్ట్ ప్రోడక్ట్ లీడర్ రాహుల్ రూపానీ తన లింక్డిన్‌లో పంచుకున్నారు.అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన కూడా తన బ్యాగును ఈ డ్రైవర్ కి ఇచ్చాడు. వీసా అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉండగా ఈ అనుభవం ఆయనకు ఎదురైంది. దీంతో ఆయన ఈ ఆటోవాలా కథను తన లింక్డిన్‌లో పంచుకున్నారు. ఈ కథ వైరల్ కావడంతో ఈ ఆటో డ్రైవర్ తెలివితేటలపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఏ యాప్ లేదు, టెక్నాలజీ లేదు, పెట్టుబడీ లేదు.. కానీ ఆలోచన ఉందంటే విజయం సాధ్యమే అనే సంగతిని ఈ ఆటో డ్రైవర్ కథ నొక్కి చెబుతుంది. ఈ కథ ఆధునిక యుగంలో భారతదేశంలో ఓ సాధారణ వ్యక్తి తన తెలివితో విజయానికి ఎలా దారులు వేసుకుంటాడో చూపించే మంచి ఉదాహరణగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications