జూలై 9, 2025న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతుతో భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నిర్వహించిన ఈ సమ్మె బ్యాంకింగ్, రవాణా, మైనింగ్, గవర్నమెంట్ సంస్థ సదుపాయాలు వంటి రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిస్థితులు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలో ప్రజలు తమ నిత్యకార్యాలతో ముందుకు సాగారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు యథాతథంగా నడిచాయి. చాలా చోట్ల వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల పాక్షికంగా మూసి ఉండటం కనిపించింది. విద్యా సంస్థలకు సంబంధించి ఎలాంటి అధికారిక సెలవు ప్రకటనలు జారీ చేయలేదు, అందువల్ల స్కూల్స్, కాలేజీలు సాధారణంగా నడిచాయి.
భారత్ బంద్‌కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు పెద్దగా మద్దతు ఇవ్వకపోవడమే వల్ల ప్రభావం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం అయ్యింది. కొన్ని చోట్ల రైతు సంఘాలు ప్రదర్శనలు నిర్వహించినా, వాటి వల్ల ప్రయాణదారులకి గాని, విద్యార్థులకు గాని పెద్ద అంతరాయం కలగలేదు.
హైదరాబాద్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు జనాలకి ప్రతిరోజూ లాగానే అందుబాటులో ఉన్నాయి. స్కూల్స్, కాలేజీలకు ఎలాంటి సెలవు ప్రకటించలేదు. విద్యా సంస్థలు మామూలుగానే కొనసాగుతున్నాయి.
ఇక బ్యాంకింగ్ రంగంలో మాత్రం కొంతభాగంగా ప్రభావం కనిపించింది. బ్యాంకు ఉద్యోగ సంఘాల మద్దతుతో కొన్నిచోట్ల బ్యాంకులు మూసివేయబడ్డాయి, కానీ ATMs, డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. భారత మజ్దూర్ సంఘ్ (BMS) వంటి ప్రధాన కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వలేదని వెల్లడించింది. అయితే, మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలు దీనిని ఖండించాయి, తమ పూర్తి మద్దతు బంద్‌కు ఉందని స్పష్టం చేశాయి.
మొత్తంగా చూస్తే, జాతీయ స్థాయిలో జరిపిన ఈ బంద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను పెద్దగా ప్రభావితం చేయలేదు. ప్రజలు సాధారణంగా తమ పనులకు వెళ్లారు, విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు, రవాణా కూడా సజావుగానే సాగుతుంది. ఇది రాష్ట్ర ప్రజల్లో బంద్‌పై స్పష్టమైన అవగాహన, అలాగే ప్రభుత్వం తీసుకున్న సమర్థ చర్యల ఫలితం అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications