2016లో దివాళా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(RCom)కు సంబంధించిన స్పెక్ట్రంను ఉపయోగించుకున్నందుకు ఆ సంస్థ బాకీలను రిలయన్స్ జియో సంస్థ కట్టాలని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఆర్‌కామ్‌కు సంబంధించి దివాళా ప్రక్రియ కొనసాగుతోన్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ(DoT), కార్పోరేట్ వ్యవహారాల శాఖ(MCA) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి కేంద్రం తన స్టాండ్ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం ప్రశ్నించింది.

శాఖల మధ్య భేదాభిప్రాయాలు.. కేంద్రం స్టాండ్ ఏమిటి
రెండు మంత్రిత్వ శాఖల మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో రిలయన్స్ జియోపై కేంద్రం తన వైఖరి తెలపాలని సుప్రీం కోర్టు కోరింది. ఏజీఆర్‌కు సంబంధించిన బకాయిలను చెల్లించాలని రిలయన్స్ జియోను ఎందుకు అడగరాదో చెప్పాలని ప్రశ్నించింది. స్పెక్ట్రం విక్రయ అంశంపై టెలికం విభాగం, కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. దీంతో కేంద్రం స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కేంద్రం, డాట్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. మంగళవారం నాటికి ఏడాది వారిగా ఆర్.కామ్. బకాయిలను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ రోజు విచారణ కొనసాగనుంది.

భేదాభిప్రాయం ఇక్కడే..
దివాళా ప్రక్రియ కొనసాగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి వీల్లేదనేది డాట్ అభిప్రాయం కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సోమవారం తెలిపారు.

చట్టబద్దమైన ఆధారం లేదు..
రిలయన్స్ కమ్యూనికేషన్స్ బకాయిలు కట్టాలని తమకు చెప్పడానికి ఎలాంటి చట్టబద్దమైన ఆధారం లేదని సుప్రీం కోర్టుకు రిలయన్స్ జియో తెలిపింది. 2016 నుండి ఆర్.కామ్. స్పెక్ట్రంను ఉపయోగిస్తున్నందున దాని బకాయిలు ఎందుకు చెల్లించరాదో చెప్పాలని ఆగస్ట్ 14న సుప్రీం కోర్టు.. జియోను ప్రశ్నించింది. దీనికి రిలయన్స్ సోమవారం రాతపూర్వక సమాధానం సమర్పించింది. ఆర్.కామ్.తో ఎలాంటి స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందం లేదని, ఇందుకు మార్గదర్శకాలు ఉన్నాయని, కాబట్టి బకాయిలు చెల్లించాలని చెప్పడానికి ఎలాంటి లీగల్ ఆధారం లేదని తెలిపింది. స్పెక్ట్రం షేరింగ్ 5 సెప్టెంబర్ 2016 నుండి ప్రారంభమైందని, ఇది కూడా కేవలం 4జీ సేవలకు మాత్రమేనని, 2జీ, 3జీ సేవలకు సంబంధించి కాదని తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రంను సరళీకృతం చేసేందుకు ఆర్.కామ్. రూ.6,627 కోట్లు చెల్లించిందని, షేరింగ్ అగ్రిమెంట్ సమయంలో ప్రభుత్వానికి ఈ మొత్తం వచ్చిందని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications