ITR ఫైలింగ్‌కు జూలై 31 లాస్ట్ డేట్.. గడువు పొడిగింపుకు నో ఛాన్స్.. ఇదీ కారణం!
ITR Filing: వేతన జీవులు తమ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గరపడుతోంది. ఈ నెలాఖరు జూలై 31తో గడువు ముగియనుంది. ప్రతి ఏడాది వివిధ కారణాల వల్ల లాస్ట్ డేట్ ను ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది. మరి ఈసారి కూడా ఇలాగే జరుగుతుందా అంటే లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
2023-24కి గాను ట్యాక్స్ రిటర్న్స్ కు చివరి తేదీ జూలై 31. గతంలో పలుమార్లు ఈ తేదీని ఆదాయపు పన్ను శాఖ ఎక్స్ టెండ్ చేసింది. అయితే ఈసారి మాత్రం పొడిగింపు ఉందని నిపుణులు భావిస్తున్నారు. AY 2023-24కి సంబంధంచి కొత్త ITR ఫారమ్స్ ను ఒక నెల ముందుగానే రిలీజ్ చేయడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

కొత్త ITR ఫారమ్‌లను ఫిబ్రవరి 10న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) నోటిఫై చేసింది. వాటిని ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే 2022 బడ్జెట్ లో ప్రభుత్వం క్రిప్టో ఆదాయంపై ట్యాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఈ దఫా కొత్త ఫారమ్స్ లో క్రిప్టో, ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం కోసం ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేశారు.
సొంతగా కానీ, ఆథరైజ్డ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ద్వారా కానీ ITR ఫైల్ చేయవచ్చు. అయితే ఎటువంటి తప్పులు దొర్లకుండా ఫైల్ చేసేందుకు ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ సలహా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల జూలై 31లోగా ITR ఫైల్ చేయలేకపోతే, కొంత మొత్తం ఫైన్ చెల్లించి డిసెంబర్ 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు IT శాఖ అనుమతిస్తోందని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications