రూ.2,000 నోటుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఏటీఎం కేంద్రాల్లో రూ.2,000 నోట్లకు బదులు ఎక్కువగా రూ.500 నోట్లు ఉంచడం ద్వారా అధిక విలువ కరెన్సీ నోట్లను క్రమంగా వెనక్కి తీసుకోవడానికి ఇది సంకేతమనే వార్తలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద అఢిగిన ప్రశ్నకు గత ఏడాది RBI గతంలో సమాధానమిస్తూ రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే. రూ.2 వేల నోటు కనుమరుగు కానున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర నిర్మలా సీతారామన్ స్పందించారు. రూ.2 వేల నోట్ల జారీని నిలిపి వేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని నిర్మల స్పష్టం చేశారు. బుధవారం వివిధ ప్రభుత్వ బ్యాంకుల కీలక అధికారులతో సమావేశమైన ఆమె దీనిపై వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంత వరకు బ్యాంకులకు అలాంటి సూచనలేమీ ఇవ్వలేదన్నారు.

రూ.2వేల నోట్లపై వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. రూ.2 వేల విలువైన నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని, ఈ విషయంలో ఎలాంటి భయాలు, ఆందోళనలు అవసరం లేదన్నారు. పుకార్లను నమ్మవద్దని కోరారు.
ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు ఆర్బీఐ ఇచ్చిన సమాచారం మేరకు.. 2016-17లో రూ.2,000 నోట్లను 3,542.991 మిలియన్లు ముద్రించగా, 2017-18లో ఈ సంఖ్య 111.507కు తగ్గింది. 2018-19లో అయితే 46.690 మిలియన్లకు తగ్గింది. ఈ లెక్కన ఆర్బీఐ రూ.2000 నోట్లను క్రమంగా వెనక్కి తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. దేశంలో చలామణిలో ఉన్న ద్రవ్యనోట్లలో రూ.2,000 నోట్ల శాతం తగ్గుతోంది. 2016-17లో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2,000 నోట్ల వాటా 3.3 శాతం కాగా 2018-19కి వచ్చే సరికి ఇది 3 శాతానికి పడిపోయింది.


Click it and Unblock the Notifications