ఏ ప్రభుత్వరంగ బ్యాంకు(PSU) కూడా సర్వీస్ ఛార్జీలు పెంచలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఒక నెలలో బ్యాంకు శాఖలో నగదు డిపాజిట్, ఉపసంహరణ ట్రాన్సాక్షన్స్ సంఖ్యకు సంబంధించి చేసిన మార్పులను కూడా వెనక్కి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు ఛార్జీలు పెంచబోవని తేల్చి చెప్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన నేపథ్యంలో బ్యాంకు అకౌంట్ కలిగిన వారికి ఊరట దక్కనుంది. ప్రభుత్వరంగ బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను పెంచాయనే వార్తలను కేంద్రం తోసిపుచ్చింది.

సర్వీస్ ఛార్జీలు పెంచలేదు
మనీ డిపాజిట్, మనీ విత్‌డ్రాకు సంబంధించి సేవలను నెలకు ఐదుసార్లు ఉచితంగా పొందే అవకాశం ఉందని, దానిని మూడుసార్లకు తగ్గిస్తూ BOB నిర్ణయం తీసుకుందని, నవంబర్ 1వ తేదీ నుండి ఈ సవరణ అమలులోకి వస్తున్నట్లు తెలిపిందని, కానీ కరోనా మహమ్మారి, ప్రస్తుత పరిమాణాల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉపసంహరించుకుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఇతరప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో సర్వీస్ ఛార్జీలలో మార్పులు చేయలేదని తెలిపింది.

ఛార్జీలు పెంచకూడదని సూచించాం
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తాము అందిస్తోన్న సేవలకు పారదర్శకత, సమంజసమైన రీతిలో విచక్షణతో ఛార్జీలను విధించేందుకు అనుమతి ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిణామాల కారణంగా సమీప భవిష్యత్తులో ఛార్జీలు పెంచకూడదని PSBలకు తెలియజేశామని ఆర్థిక శాఖ వెల్లడించింది. దీంతో కరోనా ప్రతికూల సమయంలో ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను సమీప భవిష్యత్తులో పెంచబోవని వెల్లడించింది.

వెనక్కి తీసుకున్న బీవోబీ
60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదని, 41.13 కోట్ల జన్ ధన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు బ్యాంకు శాఖకు వచ్చి నగదును మూడుసార్లకు మించి డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా ఛార్జీలు విధిస్తున్నామని, నాలుగోసారి నుండి నగదు డిపాజిట్ చేయడానికి ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.40 నుండి రూ.50 మధ్య ఛార్జీ వసూలు చేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తొలుత ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత వెనక్కి తీసుకుంది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications