సినిమాలు లేవు, కానీ ఇప్పటికీ ఇండియాలోనే రిచెస్ట్ నటి: ఆలియా, దీపిక కంటే కూడా

భారతదేశంలో అత్యంత ధనవంతులైన సినీ హీరోయిన్ల పేర్లు వినగానే దీపికా పదుకొనే, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్‌ సాధారణంగా గుర్తుకు వస్తారు. కానీ జూహి చావ్లా ఇప్పుడు ఈ స్టార్లందరికి మించి రూ.4,600 కోట్ల సంపదతో టాప్'లో ఉన్నారు. హర్యానా అత్యంత ధనికుల లిస్ట్ 2024 ప్రకారం, జూహి చావ్లా భారతదేశంలో అత్యంత ధనిక నటి అని నివేదికలు సూచిస్తున్నాయి.

కానీ ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, ఎందుకంటే జూహి చావ్లా దశాబ్ద కాలంగా సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. ఆమె నటించిన చివరి పెద్ద హిట్ చిత్రం 2009లో విడుదలైంది. అయితే, నిజం ఏమిటంటే ఆమె సంపదలో ఎక్కువ భాగం సినిమాల నుండి కాదు. జూహి చావ్లా ఆదాయాన్ని వ్యాపారం, ఐపీఎల్ టీం యాజమాన్యం, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడుల నుండి సంపాదిస్తుంది.

No films but she is still richest actress in India Above Alia and Deepika

బాలీవుడ్ సూపర్ స్టార్ నుండి వ్యాపారంలోకి
1980 నుండి 1990లలో ప్రముఖ బాలీవుడ్ నటి జూహీ చావ్లా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. "ఖయామత్ సే ఖయామత్ తక్", "హమ్ హై రహి ప్యార్ కే", "దార్", "యస్ బాస్", ఇంకా "బోల్ రాధా బోల్" వంటి సూపర్ హిట్ సినిమాలు ఆమెకు అపారమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. అయితే, ఆమె అద్భుతమైన వ్యాపార వ్యూహమే ఆమెను భారతదేశంలో అత్యంత ధనిక నటిగా చేసింది.

ఐపీఎల్'తో సంబంధం విలువ రూ.1000 కోట్లు
2007లో జూహీ చావ్లా, ఆమె భర్త జే మెహతా షారుఖ్ ఖాన్‌తో కలిసి ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రూ.623 కోట్లకు కొనుగోలు చేశారు. ఫోర్బ్స్ ప్రకారం, KKR ప్రస్తుత విలువ $1.1 బిలియన్లు (రూ.9,139 కోట్లు). ఈ పెట్టుబడి వారి సంపదకు గణనీయంగా దోహదపడింది.

బాలీవుడ్ కాకుండా వ్యాపారం అండ్ పెట్టుబడులు
షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ గ్రూప్'కు జూహి సహ వ్యవస్థాపకురాలు కూడా. అదనంగా ఆమె భర్త మెహతా గ్రూప్‌లో భాగమైన సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్‌లో ఆమెకు పెద్ద పెట్టుబడి ఉంది. అంతేకాదు ముంబైలోని మలబార్ హిల్‌లో విలాసవంతమైన ఇల్లు, పోర్బందర్‌లో ఒక వారసత్వ బంగ్లా సహా రెండు లగ్జరీ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

లగ్జరీ లైఫ్ స్టయిల్ / కార్ల నుండి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల వరకు
జుహీ లగ్జరీ కార్స్ కలెక్షన్స్ లో కొన్ని కార్లు:
*ఆస్టన్ మార్టిన్ రాపిడ్ - రూ.3.3 కోట్లు
*BMW 7-సిరీస్ - రూ.1.8 కోట్లు
*మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ - రూ.1.7 కోట్లు
*జాగ్వార్ XJ - రూ.1.2 కోట్లు
*పోర్షే కయెన్ -రూ.1.36-2 కోట్లు

వీటితో పాటు ఆమె మ్యాగీ, పెప్సీ, కుర్కురే, కెల్లాగ్స్, రూఅఫ్జా, ఇమామి బోరోప్లస్, కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ప్రమోషన్స్ ఆమోదించింది. జూహీ చావ్లా తన సినీ కెరీర్‌ను కేవలం ప్రారంభంగానే భావించి ముందుకు సాగుతూ వ్యాపార సంస్థలు ఇంకా పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. బాలీవుడ్‌ను విడిచిపెట్టిన తర్వాత ఆమె తెలివైన పెట్టుబడుల ద్వారా భారతదేశంలో అత్యంత ధనిక నటి స్థానాన్ని సాధించింది. సినిమాలపై మాత్రమే ఆధారపడకుండా వివిధ రంగాలలోకి వెళ్లడం ద్వారా ఆర్థిక సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో జూహీ చావ్లా లైఫ్ స్టోరీ ఒక ఉదాహరణ.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+