AI రంగంలో పని చేయాలంటే ‘సీనియర్’ స్థాయిలో నైపుణ్యం ఉండాలి!

ఇటీవలి కాలంలో టెక్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్న విషయం ఏంటంటే అనేక AI కంపెనీలు ఇకపై జూనియర్ ఇంజినీర్లను హైర్ చేసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న ఈ సంక్షోభ సమయంలో, ప్రముఖ AI కంపెనీలు కూడా కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యే ఇంజినీర్లకు అవకాశాలపై తలుపులు మూస్తున్నాయన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

AI AI Anthropic AI AI companies Junior engineers Entry-level jobs AI tools Senior developers Tech hiring trends AI impact Job market Future of work

అమెరికాకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ అమాండా గూడాల్ (jobchick), "AI కంపెనీలు ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్లను హైర్ చేసుకోవడం లేదు. వాళ్లు ఇప్పటికే AI టూల్స్‌తో పనిచేయగలిగే సీనియర్ డెవలపర్లను మాత్రమే కోరుకుంటున్నారు" అని పేర్కొన్నారు.

ఆమె పేర్కొన్నట్లుగా, Anthropic అనే ప్రముఖ AI స్టార్టప్ కంపెనీ ఫ్రెష్ గ్రాడ్స్‌కి లేదా ఎంట్రీ-లెవల్ ఇంజినీర్లకు అవకాశం ఇవ్వడంలేదని, అంతకు బదులుగా AI టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించి పెద్ద స్కేల్‌లో పని చేయగలవాళ్లను మాత్రమే హైర్ చేస్తోందని తెలిపారు.

Anthropic CPO మైక్ క్రిగర్ (Instagram సహ వ్యవస్థాపకుడు) మాట్లాడుతూ, కంపెనీకి ఒక "బలమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం" లేదని, ఎంట్రీ లెవల్ ఉద్యోగులను హైర్ చేయడంలో కొంత "హెసిటేషన్" ఉందని తెలిపారు. అలాగే, CEO డారియో అమెడీ Axios ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI కారణంగా 50% వరకు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తప్పిపోవచ్చని హెచ్చరించారు.

అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. Anthropic కంపెనీ ప్రతినిధి ప్రకారం, వారికి Claude అనే AI చాట్‌బాట్‌ను వినియోగిస్తూ చక్కటి పనితీరు చూపించగలవారు అయితే, వారిని హైర్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.

సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకరు, "ఇది వాస్తవం ఇప్పుడు AI అనే entity కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తిలా పనిచేస్తోంది" అని చెప్పారు. మరొకరు, "కంపెనీకి ఇది సరైన వ్యూహమే అయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో టాలెంట్ దొరకడం కష్టమైందని వీరే కంప్లైన్ చేస్తారు" అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, ఒక సీనియర్ డెవలపర్ మాట్లాడుతూ "మేము పనిచేస్తున్న కంపెనీలో కూడా జూనియర్ డెవలపర్లను హైర్ చెయ్యం ఎందుకంటే జెమిని కోడ్ అసిస్టెంట్ అనే AI టూల్ తక్కువ అనుభవం ఉన్న కోడర్‌లకు సమానంగా పనిచేస్తోంది. నిజం చెప్పాలంటే, నా టీమ్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ జూనియర్ డెవలపర్ ఉండలేదు. అయినా నేను మరింత ప్రొడక్టివ్‌గా పని చేస్తున్నాను" అన్నారు.

Anthropic కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం అక్కడ దాదాపు 200 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అత్యంత అనుభవం కలిగిన అభ్యర్థులకే (కనీసం 5 సంవత్సరాల అనుభవం) ఉద్దేశించబడ్డాయి.

అమాండా గూడాల్ తన పోస్ట్‌ను ఒక ఆలోచనాత్మక ప్రశ్నతో ముగించారు. ఆమె చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. ''ఇలా కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వకపోతే, రేపు ఇలాంటి కంపెనీలే 'మాకు టాలెంట్ దొరకడం లేదు' అని ఫిర్యాదు చేస్తాయేమో!'' అంతేకాక, భవిష్యత్‌ తరం ఉద్యోగులకు దారితీయాల్సిన అవకాశాల మెట్టు (ladder)ను కంపెనీలు తామే తొలగిస్తున్నట్లుగా కూడా ఆమె పేర్కొన్నారు.

ఈ పరిస్థితి ఒక్క Anthropic కంపెనీకి మాత్రమే కాక, మొత్తం టెక్ రంగానికి సంకేతంగా మారుతోంది. ఒకవైపు జూనియర్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతుండగా, మరోవైపు AI టూల్స్ మానవశక్తికి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అయితే దీని వలన ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందనే ప్రశ్న సాంకేతిక రంగాన్ని ఇప్పటి నుంచే ఆలోచనలో పడేస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+