జీఎస్టీ కంపెన్షేషన్ సెస్ విషయంలో కేంద్రం తీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(CAG) తప్పుబట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జీఎస్టీ పరిహార సెస్‌ను మళ్లించలేదని తెలిపింది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.47,272 కోట్ల మొత్తం పరిహారాన్ని కేంద్రం తన వద్దే ఉంచుకొని, ఇతర అవసరాలకు వినియోగించిందని కాగ్ ఇటీవల నివేదిక ఇచ్చింది. అయితే నిధులు తాత్కాలికంగా అట్టిపెట్టుకోవడమంటే ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాదని ఆర్థిక శాఖ తెలిపింది.

ఇతర అవసరాలకు నిధులు..
జీఎస్టీ అమలు కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు పరిహారంగా సెస్సును కేంద్రం ఇవ్వాల్సి ఉందని కాగ్ పేర్కొంది. సెస్‌ల రూపంలో వసూలైన మొత్తాన్ని కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా(CFI)కి బదలీ చేయాల్సి ఉందని తెలిపింది. 2017-18లో రూ.62,612 కోట్ల మేర సెస్ వసూలు కాగా, రూ.56,146 కోట్లు ఆ నిధికి బదలీ చేశారని, 2018-19లో రూ.95,081 కోట్లు వసూలు కాగా, రూ.54,275 కోట్లు బదలీ అయ్యాయని పేర్కొంది. ఆ రెండేళ్లలో రూ.47,272 కోట్లు తక్కువగా ఆ నిధికి బదలీ అయ్యాయని కాగ్ పేర్కొంది. ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించినట్లు నివేదికలో వెల్లడించింది.

రెండేళ్లలో ఇలా తగ్గుదల..
ది జీఎస్టీ కంపెన్షేషన్ సెస్ యాక్ట్ 2017 కింద విధించిన సెస్‌ను జీఎస్టీ అమలు కారణంగా ఆదాయ నష్టం కలిగిన రాష్ట్రాలకు పరిహారంగా ఇవ్వాలని కాగ్ పేర్కొంది. 2017-18లో రూ.6,466 కోట్లు, 2018-19లో రూ.40,806 కోట్లు తక్కువగా బదలీ అయినట్లు తెలిపింది. అంటే మొత్తం రూ.47,272 కోట్లు తక్కువగా బదలీ అయినట్లు తెలిపింది. ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించిందని, దీంతో ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు, ద్రవ్యలోటు తక్కువగా నమోదయినట్లు తెలిపింది.

అంతకంటే ఎక్కువ చెల్లింపులు జరిగాయి
ఆర్థిక శాఖ దీనిపై స్పందిస్తూ రెండు సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు కేంద్రం చెల్లించిందని తెలిపింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.95,444 కోట్లు వసూలు కాగా, రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువగా రూ.1,65,302 కోట్లు కేంద్రం విడుదల చేసిందని గుర్తు చేసింది. నిధుల సర్దుబాటు కారణంగా తాత్కాలికంగా అట్టిపెట్టుకుంటే నిధులు మళ్లించినట్లు పేర్కొనడం సరికాదని తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications