కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లోని దుకాణాలు, మాల్స్‌లలో నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ పైన రాయితీలు తగ్గాయి. కరోనా మహమ్మారికి ముందు, అలాగే లాక్ డౌన్‌కు ముందు వీటిపై పెద్ద ఎత్తున తగ్గింపు ఉంది. కొన్నింటిపై 30 శాతం నుండి 50 శాతం వరకు కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్లు తగ్గించారు. మాల్స్, హోల్ సేల్ మార్కెట్లో తక్కువ ధరకు వస్తువులు దొరుకుతాయని వెళ్లిన వారికి గతంతో పోలిస్తే ధరలో పెద్ద తేడా కనిపించి అవాక్కవుతున్నారట.
కేవలం మార్కెట్‌లోనే కాదు ఆన్‌లైన్ ధరలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వాతావరణాన్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ప్యాకింగ్ ఫుడ్ ఐటమ్స్, సబ్బులు, నూనెలు వంటి వాటిపై భారీ డిస్కౌంట్లు ఉండేవి. సభ్యత్వం ఉంటే అదనపు రాయితీలు కూడా ఉండేవి. ప్రస్తుతం అన్ని డిస్కౌంట్లు పక్కన పెట్టి మహా అయితే 15 శాతం మాత్రమే ఇచ్చే మాల్స్ కనిపిస్తున్నాయట. ఉదాహరణకు గతంలో 30 శాతం రాయితీ ఉంటే దానిని 15 శాతానికి తగ్గిస్తున్నారట.

సప్లై చైన్ తెగిపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, సరఫరా మెరుగుపడ్డాక ఇదివరకటి రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. నిత్యావసరాలే కాదు మెడిసిన్స్ పైన కూడా కొంతమంది రాయితీలు ఎత్తేశారు. కరోనాకు ముందు పది శాతం రాయితీ ఉన్న మెడిసిన్స్‌పై ఇప్పుడు ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదట.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications