ఇప్పటి కాలంలో టెక్ రంగంలో ఉద్యోగం దొరకాలంటే డిగ్రీ, రిజ్యూమ్, నెట్‌వర్క్ ఇవన్నీ తప్పనిసరి అనే నమ్మకం ఎక్కువగా ఉంది. కానీ బెంగళూరులోని స్టార్టప్ "స్మాలెస్ట్ ఏఐ"(Smallest AI) వ్యవస్థాపకుడు సుదర్శన్ కమత్ ఇటీవల చేసిన ఓ పోస్టు ఈ నమ్మకాలను తుడిచి పెట్టింది.

ఆయన తన కంపెనీలో ఫుల్ స్టాక్ లీడ్ ఉద్యోగానికి వ్యక్తిని నియమించాలనుకున్నారు. కానీ అర్హతలు చూడగానే అందరూ షాక్ అవ్వాల్సిందే డిగ్రీ ఉండనవసరం లేదు, ఉద్యోగ అనుభవం తప్పనిసరి కాదు, రిజ్యూమ్ పంపక్కర్లేదు. మీ పనితణాన్ని చెప్పే 100 పదాల పరిచయం, మీ గత ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన లింకులు ఉంటే చాలు.
పైగా ఆ ఉద్యోగానికి ఇచ్చే జీతం ఆశ్చర్యపరిచేలా ఉంది. మొత్తం CTC (కాస్ట్ టు కంపెనీ) రూ. 1 కోటి అని పేర్కొన్నారు. ఇందులో రూ. 60 లక్షలు నేరుగా సాలరీగా చెల్లించబడతాయి, మిగతా రూ. 40 లక్షలు భాగం కంపెనీలో ఈక్విటీ షేర్ల రూపంలో అందించబడుతుంది. అంటే ఉద్యోగి కేవలం జీతం కాకుండా, కంపెనీ ఎదుగుదలపై భాగస్వామిగా కూడా మారతాడు. ఇది సాధారణంగా స్టార్టప్‌లలో కనిపించే ప్రాక్టీస్ అయినా, ఇలా బహిరంగంగా, డిగ్రీలు లేకుండా ఈ స్థాయి ప్యాకేజీ ఆఫర్ చేయడం చాలా అరుదు.
ఈ ఉద్యోగానికి డిగ్రీ కంటే స్కిల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. అభ్యర్థి కనీసం 4 నుంచి 5 సంవత్సరాల వరకు ప్రాక్టికల్ అనుభవం కలిగి ఉండాలి. ముఖ్యంగా Next.js, పైతాన్(Python), React.js వంటి టెక్నాలజీలపై లోతైన అవగాహనతో పాటు, ప్రాజెక్టులను స్వయంగా హ్యాండిల్ చేసిన అనుభవం ఉండాలి. అదేవిధంగా, ఈ రోల్‌కు మేనేజ్మెంట్ కాదు హ్యాండ్స్-ఆన్ డెవలప్‌మెంట్ చేయగల సామర్థ్యం ముఖ్యమైనది. అంటే, ప్రతి చిన్న కోడ్‌ని రాయగలిగి సమస్యలను స్వయంగా పరిష్కరించ గల టెక్నికల్ సత్తా ఉన్నవారిని ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ఈ పోస్టు వైరల్ కావడంతో టెక్ వర్గాల్లో కొంత చర్చకు దారితీసింది. వేల మంది అభ్యర్థులు తమ వివరాలు పంపారు. కొందరు ఈ నిర్ణయాన్ని ప్రశంసించగా, మరికొందరు దీనిపై విమర్శలు చేశారు. "ఇది నిజంగా స్కిల్స్‌కు గొప్ప గౌరవం" అంటుంటే, ఇంకొందరు "ఇది పబ్లిసిటీ స్టంట్ కావొచ్చు" అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఇది ఒక మారుతున్న ట్రెండ్‌కు సంకేతం.
అందరూ తెలిసికొవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు టెక్ ప్రపంచం చదువుకొని తెచ్చుకున్న మార్కులకంటే, మీ చేతిలో ఉన్న నైపుణ్యాలను ఎక్కువగా విలువ చేస్తోంది. డిగ్రీల కన్నా డెడికేషన్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాజెక్ట్ డెమోలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. మీరు నేర్చుకుంటున్న మార్గం బలమైనదైతే, కంపెనీలు మీ వెంటే వస్తాయి.
ఈ విధానంతో హైరింగ్ జరగడం యువతకు కొత్త దారి చూపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్‌కి ఇది ఆశా కిరణంగా మారుతుంది. ఇకపై ఉద్యోగం దొరకాలంటే పెద్ద డిగ్రీలు కాకపోయినా సరే, మీరు చేసిన పనిని నమ్మే ధైర్యం ఉండాలి.
హైరింగ్ ట్రెండ్ మారుతోందా?
జూలై 15న వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా, డిగ్రీ కంటే స్కిల్స్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న ట్రెండ్‌కి ఇది మంచి ఉదాహరణ. ఇప్పటి స్టార్టప్‌లు మార్కులు, సర్టిఫికెట్‌ల కన్నా టాలెంట్‌కి, ప్రాక్టికల్ అనుభవంకి ఎక్కువ విలువ ఇస్తున్నాయి.
ఇదే కంపెనీ ఇదివరకే జూనియర్ డెవలపర్ పోస్టులకు రూ. 40 లక్షలు జీతం ప్రకటించి, రిజ్యూమే అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలా స్కిల్స్ ఆధారంగా ఉద్యోగాలిచ్చే కొత్త దిశగా ట్రెండ్ మారిపోతోందని చెప్పొచ్చు.
More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

Bengaluru: వారం రోజుల్లో బెంగళూరు పీజీల్లో గ్యాస్ ఖాళీ..! ప్రభుత్వం ఏం చేయబోతోంది?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరులో సామాన్యుడు బ్రతకగలడా? వైరల్ అవుతున్న టెక్కీ నెలవారీ ఖర్చుల చిట్టా!

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!



Click it and Unblock the Notifications