ఒక భారతీయ యువ సీఈఓ రూ.2 లక్షల స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ అవకాశం ఇస్తున్నారు. అది కూడా రిమోట్‌గా అంటే ఇంట్లో నుంచే పని చేయొచ్చు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే... మీరు హైస్కూల్ స్టూడెంట్ అయినా సరే, దరఖాస్తు చేసుకునే అర్హత ఉంది! డిగ్రీ అవసరం లేదు, మీకు నిజంగా ఏఐపై ఆసక్తి ఉంటే చాలు.

పుచ్ AI అనే స్టార్టప్‌కి చెందిన సీఈఓ సిద్ధార్థ్ భాటియా ఒక గొప్ప ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ప్రకటించారు. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు స్టైపెండ్ లభిస్తుంది.
సిద్ధార్థ్ భాటియా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. IIT బొంబేలో చదివిన అర్జిత్ జైన్‌తో కలిసి పుచ్ AI అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఈ కంపెనీకి భాటియా CEOగా ఉన్నారు. డిగ్రీ అవసరం లేకుండా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఆయన సంస్థ ముందుకు సాగుతోంది. ఇదే విషయాన్ని భాటియా ఒక ఉదాహరణతో వివరించారు "మేము ఇటీవల స్కూల్‌లో చదువుతున్న ఒక విద్యార్థినే ఇంటర్న్‌గా ఎంపిక చేశాం. కాబట్టి డిగ్రీ కావాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు." అనడంతో ఆయన సంస్థ ఎంత ఓపెన్ మైండెడ్‌గా అవకాశాలు ఇస్తోందో అర్థమవుతుంది.
పుచ్ AI అంటే ఏమిటి?
పుచ్ AI అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్. దీని ముఖ్య ఉద్దేశం ఎవరికైనా సులభంగా AIను ఉపయోగించేలా చేయడం. టెక్నాలజీ పరిజ్ఞానం లేకపోయినా, ఈ టూల్ సహాయంతో మీరు కూడా AIను ఉపయోగించవచ్చు. అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా ఈ స్టార్టప్ పనిచేస్తోంది.
పుచ్ AI ప్రస్తుతం రెండు పోస్టులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటించింది. AI Engineer మరియు Growth Magician. దీనికీ ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1 నుండి రూ. 2 లక్షల వరకు స్టైపెండ్ ఇస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తిగా రిమోట్ విధానంలో ఉంటుంది. అప్లై చేసే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. CEO సిద్ధార్థ్ భాటియా X (Twitter)లో చేసిన పోస్టుకు మీరు ప్రత్యక్షంగా కామెంట్ చేయాలి. ఆ కామెంట్‌లో "మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేయాలి?" అలాగే "మీరు ఈ స్టార్టప్‌లో చేరితే ఏమి చేయాలనుకుంటున్నారు?" అనే విషయాలను వివరించాలి. డైరెక్ట్ మెసేజ్ మాత్రం పంపొద్దని స్పష్టం చేశారు CEO.
మీకు సరైన వ్యక్తి గుర్తుపడితే అతన్ని ట్యాగ్ చేస్తే సరిపోతుంది. అతను ఎంపికైతే, మీకు ఐఫోన్ గిఫ్ట్ వస్తుంది కానీ ఒక కామెంట్‌కు ఒక్కరినే ట్యాగ్ చేయాలని నిబంధన ఉంది. ఈ ఇంటర్న్షిప్‌లో పాల్గొనే వారికి ప్రాక్టికల్ ప్రాజెక్టుల మీద పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో ఉపయోగించే టూల్స్, ఫ్రేమ్‌వర్క్స్‌పై అనుభవం సంపాదించవచ్చు. ఇది వారి కెరీర్‌కి మంచి సహాయం చేస్తుంది. ఈ ఇంటర్న్షిప్ ప్రత్యేకత ఏమిటంటే కంపెనీ CEOతో నేరుగా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలు యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి.
ఇప్పటికే వేలాది మంది యువత ఈ పోస్టుకి స్పందిస్తున్నారు. తమ లక్ష్యాలు, టాలెంట్ గురించి కామెంట్లలో రాస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications