Income Tax Rebate: ఫిబ్రవరి 1న ప్రతి ఏటా మాదిరిగా రాబోయే వార్షిక బడ్జెట్ కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు వస్తున్నందున దీనిపై రైతుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు అనేక మంది కోటి ఆశలు పెట్టుకున్నారు.
గడచిన ఏడాది భారత ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న పన్ను శ్లాబ్ రేట్ల విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ.. కొత్త పన్ను విధానం కింద అందిస్తున్న రిబేట్ మెుత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్త పన్ను కింద రిటర్న్ ఫైల్ చేసేవారికి కొంత ఊరట లభించినప్పటికీ.. వారికి ఎలాంటి మదింపులు అందులో ఉండకపోవటం కొంత నిరుత్సాహానికి గురిచేస్తోందని చెప్పుకోవాలి.

ఈ క్రమంలో చాలా మంది పన్ను మినహాయింపు ఆదాయ పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచొచ్చనే ఊహాగానాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి. అయితే రాబోయే మధ్యంతర బడ్జెట్ 2024 ఫిబ్రవరి 1న కొత్త పన్ను రాయితీల విషయంలో ఎలాంటి ఉపసమనం ఉండబోదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో పాత విధానంలో ఉన్న ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచి స్వల్ప ఊరటను మాత్రమే అందించారు. అలాగే కుటుంబ పింఛనుపై రూ.15,000 తగ్గింపును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దీనికి తోడు బడ్జెట్ 2023లో జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్లు.. కుటుంబ పెన్షనర్‌ల కోసం, కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ నిబంధనను ప్రవేశపెట్టారు.
మారిన పాత పన్ను శ్లాబ్ రేట్లు..
> రూ.3 లక్షల వరకు ఆదాయానికి పన్ను లేదు.
> రూ.6 లక్షల వరకు రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 5 శాతం.
> రూ.6 లక్షలకు పైగా రూ.9 లక్షల వరకు 10 శాతం.
> రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పైగా ఉంటే 15 శాతం.
> రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా ఉంటే 20 శాతం.
> రూ.15 లక్షలకు పైన ఉంటే 30 శాతం


Click it and Unblock the Notifications