fuel prices: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూలై 1, గురువారం) స్థిరంగా ఉన్నాయి. ఇంధన ధరలు వరుసగా 2వ రోజు మారలేదు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ పైన రూ.100 పైకి చేరుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ.98.81, డీజిల్ లీటర్ రూ.89.18గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.104.5, లీటర్ డీజిల్ రూ.96.72గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.98.64, డీజిల్ రూ.92.03, చెన్నైలో పెట్రోల్ రూ.99.80, డీజిల్ రూ.93.72గా ఉంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, లడక్ సహా పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 క్రాస్ చేసింది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం తదితర కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

పెట్రోల్, డీజిల్ ధరల్లో అరవై శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు రూ.100 కంటే పైకి చేరాయి. పెట్రోల్, డీజిల్ పైన రాజస్థాన్‌లో అత్యధిక వ్యాట్, ట్యాక్స్ ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కువ ట్యాక్స్ ఉంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటింది. మిడ్ ఫిబ్రవరి నుండి నెలలో పెట్రోల్ ధర ఇక్కడ సెంచరీ దాటింది.


Click it and Unblock the Notifications