కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయం తగ్గిన వ్యాపార సంస్థలు, కంపెనీలు, ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు తీసుకువచ్చిన లోన్ మారటోరియంపై వడ్డీపై వడ్డీ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పేర్కొంది. మారటోరియం నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పునఃసమీక్షించాలని సూచించింది. ఆరు నెలల మారటోరియం వ్యవధిలో వడ్డీపై వడ్డీ విధించడాన్ని ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని గత శుక్రవారం విచారణ జరిగింది. ఆ తర్వాత కేంద్రం, ఆర్బీఐ చర్చించి ఓ నిర్ణయానికి రావాలని చెప్పి, బుధవారం విచారణ జరిపింది.

ఆర్బీఐ, కేంద్రం వాదన
కేంద్రం, ఆర్బీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వడ్డీని పూర్తిగా రద్దు చేయడం బ్యాంకులకు సాధ్యం కాదన్నారు. బ్యాంకుల్లో దాదాపు రూ.133 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, వారికి వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రద్దు అంత తేలికైన విషయం కాదని తెలిపారు. రుణాలపై వడ్డీని రద్దు చేస్తే బ్యాంకింగ్ పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది.

డిపాజిటర్లు
రుణాల చెల్లింపులపై మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే అది బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అఖిల భారత డిపాజిటర్ల అసోసియేషన్ (AIBDA) తెలిపింది. ఎలాంటి వడ్డీ మాఫీ అయినా అది రుణ సంస్కృతికి విఘాతమని పేర్కొంది. బ్యాంకుల ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం ఉంటుందని, రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతిస్తే అప్పుడు బ్యాంకులు వడ్డీ ఆదాయ నష్టాన్ని డిపాజిటర్లపై వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పూడ్చుకుంటాయని ఆందోళన వ్యక్త ంచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సరికాదని తెలిపింది.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది
బ్యాంకింగ్ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై ప్రకటించిన మారటోరియం విధానం ఇందుకు సంబంధించిన ప్రయోజనం నెరవేరేట్లు లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది వడ్డీమీద వడ్డీ విధింపులా ఉందని పేర్కొంటూ, ఇలాంటి విధానంలో ఔచిత్యం ఏదీ కనబడటం లేదని వ్యాఖ్యానించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేసింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. ఈ స్కీంని పునఃసమీక్షించాలని కేంద్రం, ఆర్బీఐలకు సూచించింది. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్రత్యేకంగా సూచించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారాన్ని బ్యాంకులకు పూర్తిగా వదిలేయరాదని అభిప్రాయపడింది. ఇది కస్టమర్‌కు, బ్యాంకులకు మధ్య వ్యవహారమని కేంద్రం చెప్పడం కుదరదని పేర్కొంది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని ఒకటి మారటోరియం కాలంలో అసలు వడ్డీ విధించకపోవడం ఒకటి, వడ్డీ మీద వడ్డీ విధింపు విధించకపోవడం రెండోంది అని అభిప్రాయపడింది. మొత్తం వడ్డీ రద్దు కాకపోయినా, వడ్డీమీద వడ్డీని అయినా తొలగించాలని చెప్పింది.

బ్యాంకులు ఏం చెప్పాయి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌లు తమ వాదనలు వినిపిస్తూ వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులపై ఎంత భారం పడుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కావాలని కోరాయి. అందుకే కేసును మూడు నెలలు వాయిదా వేయాలని కోరాయి. ఆర్థిక స్థిరత్వానికి ఇది ప్రతికూలమని బ్యాంకింగ్ అసోసియేషన్, ఎస్బీఐ న్యాయవాది అన్నారు. బ్యాంకులు సమయం అడగడంతో కేసును ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఆ లోపు మారటోరియంపై కొత్త నిబంధనలు తీసుకు వచ్చే అవకాశం ఉందా అనేది అధ్యయనం చేయాలని బ్యాంకులకు సూచించింది.

పిటిషనర్ వాదన ఏమిటి?
ఈఎంఐలపై ఆగస్ట్ 31వ తేదీ వరకు అమలయ్యే మారటోరియం సమయంలో విధించే వడ్డీరేటు సమంజసం కాదని గజేంద్ర శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. మారటోరియం కాలంలో వడ్డీ భారం వేయడం రుణ గ్రహీతలకు శిక్ష విధించడమేనని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కల్పిస్తున్న జీవించే హక్కుకు ఇది విఘాతం కలిగిస్తోందన్నారు. మారటోరియం సమయంలో వడ్డీభారం లేని రుణ పునఃచెల్లింపులకు వీలుకల్పిస్తూ కేంద్రం, ఆర్బీఐకి ఆదేశాలివ్వాలని కోరారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications