రాకెట్‌లా దూసుకుపోతున్న ఈ కంపెనీ షేర్లు.. బయ్యర్స్ కుష్..3 రోజుల్లో 47% జంప్..

షేర్ మార్కెట్లో ఈ వారం ఊహించని విధంగా మారుతుంది. ఎందుకంటే ఆశించిన షేర్లు డీలా పడిపోతుండగా కొన్ని షేర్లు మాత్రం రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. ఇక పెన్నీ స్టాక్స్ కూడా బయ్యర్లకు కలిసొస్తున్నాయి. నేడు గురువారం ఉదయం స్టాక్ మార్కెట్‌లో కాస్త తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం గ్రీన్ మార్కులో కొనసాగుతుంది. ఇంకా కొన్ని షేర్లలో కూడా మంచి ర్యాలీ నమోదవుతోంది. వీటిలో 11 శాతానికి పైగా పెరిగి ట్రేడవుతున్న ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా షేర్లలో బలమైన పెరుగుదల కనిపిస్తుంది. దీనితో పాటు బుధవారం కూడా సుమారు 18 శాతం పెరుగుదల నమోదైంది, అంతేకాదు మంగళవారం కూడా 10 శాతానికి పైగా ఎగిసింది. ఈ షేర్ సెకండరీ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు ప్రస్తుతం మంచి రాబడిని ఇస్తోంది.

3 రోజుల్లో 47 శాతం
నివా బుపా షేర్లు గురువారం 11.2 శాతం పెరిగి రూ.109.34 వద్ద సరికొత్త ఆల్ టైమ్ హైని సృష్టించాయి. గత మూడు ట్రేడింగ్ రోజులలో ఈ స్టాక్ 47 శాతం పెరుగుదలను నమోదు చేసింది, దింతో రికార్డ్ లాభాన్ని నమోదు చేసింది. రాబోయే రోజుల్లో ఈ షేర్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. నిజానికి బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలో తాజాగా మంత్రుల బృందం సమావేశం జరిగింది. అందులో ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ రేట్లను తగ్గించాలనే ప్రతిపాదన వచ్చింది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి, ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

Niva Bupa hits record high Stock rallies 47 in 3 days company clarifies on GST rate report

షేర్ ధర పెరగడానికి కారణం
లైఫ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పై జీఎస్టీ రేట్ల తగ్గింపును పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 9న లోక్‌సభలో లిఖితపూర్వక లేఖ ద్వారా తెలిపారు. జీవిత బీమా ప్రీమియం, ఆరోగ్య బీమా ప్రీమియంపై ప్రస్తుతం 18 శాతం GST విధిస్తుండగా, దీనిని 5 శాతానికి తగ్గించవచ్చని తెలుస్తుంది. దింతో ఇలాంటి సమయంలో స్టాక్స్ గత మూడు రోజులుగా రాకెట్ లాగా దూసుకెళ్తుంది.

నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది బుపా గ్రూప్ అండ్ ఫెటల్ టోన్ LLP మధ్య జాయింట్ వెంచర్. ఈ కంపెనీ ఆరోగ్య బీమాలో ప్రత్యేకత ఉన్న సంస్థ. మరో ప్రధాన బీమా కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గత 5 రోజుల్లో మంచి ర్యాలీ చేస్తూ షేర్ ధర రూ. 491.55కి చేరుకున్నాయి.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+