Petrol Prices: లీటర్ పెట్రోల్ ధర ఎంత అంటే.. 100కు పైమాటే అని ఠక్కున చెప్పేస్తాం. కానీ 15కే వస్తే, ఎగిరి గంతేస్తాం. ఇది సాధ్యమా అంటే అవుననే చెబుతున్నారు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పెరుగుతున్న పెట్రో ధరలకు కళ్లెం వేయడానికి ఇతర ఇంధన వనరులపై ఆధారపడటాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
'ఇథనాల్ పై 60 శాతం, విద్యుత్ మీద 40 శాతం ఆధారపడ గలిగితే లీటరు పెట్రోల్ 15కే అందుబాటులోనికి వస్తుంది. తద్వారా అందరికీ ప్రయోజనం చేకూరుతుంది' అని గడ్కరీ తెలిపారు. రాజస్థాన్ లోని ప్రతాప్ గడ్ లో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

'రైతులు కేవలం అన్నదాతలు మాత్రమే కాదు, ఇంధనాన్ని సైతం ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు వాహనాల్లో అధిక శాతం వారి ద్వారా ఉత్పత్తి కాబడిన ఇథనాల్ తో నడుస్తున్నాయి. దీనివల్ల కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు కలగడంతో పాటు ఇంధన దిగుమతులూ తగ్గుతాయి. తద్వారా దిగుమతుల కోసం వినియోగించే 16 లక్షల కోట్లు రైతులకు చేరుతుంది' అని వెల్లడించారు.
పూర్తిగా ఇథనాల్ తో నడిచే వాహనాలను త్వరలోనే ప్రవేశపెడతామని గతంలో గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. బజాజ్, TVS, హీరో టూవీలర్లు 100 శాతం ఇథనాల్ వినియోగిస్తాయన్నారు. టయోటా క్యామ్రీ కారును ఆగస్టులో విడుదల చేస్తామని, ఇది పూర్తిగా ఇథనాల్‌తో మాత్రమే నడుస్తుందన్నారు. దీనికితోడు 40 శాతం విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.


Click it and Unblock the Notifications