Nitin Gadkari: వాహన కొనుగోలుదార్లకు శుభవార్త.. వారికి బిగ్ డిస్కౌంట్స్.. కేంద్ర మంత్రి ప్రకటన
Vehicle Scrapping: దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణానికి కూడా మేలు కలిగే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగాన్ని వాడుకులోకి తీసుకువచ్చింది. గాలి మరియు శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు వెహికల్ స్క్రాపింగ్ పాలసీని పరిచయం చేసింది. ఇటీవల దీనిపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కీలక ప్రకటన చేశారు.
ఫిట్‌నెస్ లేని పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు 2022లోనే కేంద్రం నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వాహనాల యజమానులు తమ పాత వాహనాలను తక్కు చేసేందుకు స్క్రాపింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. ఇందుకుగాను అక్కడ నుంచి సర్టిఫికెట్ పొందుతారు. ఈ ధ్రువీకరణ పత్రం ఆధారంగా కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం కొంతమేర రాయితీ అందిస్తుంది. కాగా ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇటీవల పలు కంపెనీల CEOలతో గడ్కరీ సమావేశమయ్యారు. 'సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ మీటింగ్ ఆయన అధ్యక్షతన జరిగింది. ఇందులో స్క్రాప్ వాహనాల ద్వారా ఇచ్చే రాయితీని పెంచాలని చర్చించారు. ఆయా కంపెనీలు కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించాయి. వాహన యజమానులతో పాటు తయారీ కంపెనీలు, ముఖ్యంగా పర్యావరణానికి మేలు కలిగించేదిగా ఈ పాలసీ ఉండటంతో అందరూ అంగీకారం తెలిపారు. ఇదే సమావేశంలో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను మంత్రి ముందుకు తీసుకొచ్చారు.
దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రాపింగ్ కేంద్రాలు, ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్స్ నెలకొల్పాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు. భవిష్యత్తులో భారత్ దక్షిణాసియాలోనే అతిపెద్ద స్క్రాపింగ్ హబ్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. కేవలం వాహన యజమానులు, తయారీదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉండటంతో పాటు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తద్వారా గ్రీన్ ఆర్థిక వ్యవస్థను ప్రమోట్ చేసేందుకు ఇదొక మంచి మార్గంగా కనిపిస్తోందన్నారు.


Click it and Unblock the Notifications