మాజీ CM నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. నగర అభివృద్ది కోసం పలు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే వైకాపా అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విశాఖపట్నంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. మూడు రాజధానులను ప్రకటించి, వైజాగ్ ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేశారు. తాజాగా కేంద్రం కూడా CM జగన్ ఆశలకు బూస్ట్ ఇచ్చినట్లుయింది.
దేశంలో ప్రముఖ నగరాలైన ముంబై, సూరత్‌తో పాటు విశాఖపట్నంలను గ్రోత్ హబ్ నగరాలుగా నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో పైలట్ సిటీగా వైజాగ్ ను సెలక్ట్ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో.. దక్షిణ భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం వైజాగ్ కావడం విశేషం.

వివిధ సహజ వనరులు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అద్భుతమైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు విశాఖపట్నంలో ఉన్నాయి. త్వరలో రానున్న VCIC కారిడార్, ఖరగ్‌పూర్-విజయవాడ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్, భోగాపురం విమానాశ్రయం, ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌గా వైజాగ్ ఇప్పటికే దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు తెలిపారు.
తాజాగా కేంద్రం చేసిన ఈ ప్రకటన.. పోర్ట్ సిటీ అభివృద్ధికి ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. త్వరలో ఇది దేశానికి సౌత్ ఈస్ట్ గేట్‌వేగా ఆవిర్భవించనుందని అంచనా వేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం, రైల్వే జోన్ ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయడం వల్ల దేశంలోని మెగా సిటీలలో వైజాగ్ ఒకటిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. తద్వారా హైదరాబాద్, బెంగళూరు తరహాలో పెట్టుబడులను ఆకర్షించే సత్తా నగరానికి ఉందని విశ్లేషకుల భావన.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications