Zerodha News: నటీనటుల యాడ్స్‌పై జెరోధా CEO ఆందోళన.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవంటూ వ్యాఖ్యలు
Nithin Kamath: ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ జెరోధా CEO నితిన్ కామత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటారు. తన ఆలోచనలను ఫాలోవర్స్‌తో పంచుకోవడం ఆయనకు అలవాటే. కాగా ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు. తాజాగా సినీ నటుల గురించి ఓ పోస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
అనధికార ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రచారం చేసే ప్రకటనలలో ప్రముఖ నటులు నటించడం పట్ల జెరోధా సహ వ్యవస్థాపకులు నితిన్ కామత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా క్రమబద్ధీకరించబడని ప్లాట్‌ఫారమ్ కోసం ఒక ప్రసిద్ధ నటుడి ప్రకటనను తాను చూశానని కామత్ చెప్పారు. ఆ ప్లాట్‌ఫారమ్ గురించి సదరు నటుడికి ఏ మాత్రం తెలిసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

గతంలో ఇదే తరహాలోని ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ ఆక్టాఎఫ్‌ఎక్స్ (Octafx) కోసం ప్రకటనలలో నటించిన నటులకు ఇబ్బంది కలిగినట్లు గుర్తుచేశారు. ప్రమోట్ చేసినందుకు మరియు దానికోసం నగదును స్వీకరించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాగా ఇటీవల టెలివిజన్ నటులు కరణ్ వాహి మరియు క్రిస్టిల్ డిసౌజాలను నియంత్రణ సంస్థలు ప్రశ్నించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
ఈ యాప్ మరియు దాని ప్రమోటర్లు అధిక రాబడి ఆశచూపి అనేక మంది పెట్టుబడిదారులను మోసగించారని మనీలాండరింగ్ కేసులో ED ఆరోపించింది. ఫారెక్స్ ట్రేడింగ్‌కు సంబంధించి సదరు సంస్థ RBI నుంచి అనుమతి పొందలేదని తెలుస్తోంది. అయితే ఈ తరహా ప్లాట్‌ఫారమ్స్ కార్యకలాపాలను ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి. వాటికి సంబంధించిన ప్రకటనలలో నటించిన నటీనటులు తప్పు చేయకపోయినా నిందితులుగా కనిపించే అవకాశం లేకపోలేదని అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications