Nita Ambani: అంబానీ భార్యకే ఆఫర్ ఇచ్చిన వ్యక్తి.. ఎలా షాక్ ఇచ్చిందో తెలుసా..??
Reliance World Cup: నీతా అంబానీ చాలా సాదా సీదా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పెళ్లికి ముందు ఒక టీచర్. అలాగే ఆమెకు సాంప్రదాయ నృత్యం అంటే అత్యంత మక్కువ కూడా.
అయితే ధీరూభాయ్ అంబానీ నేరుగా నీతా అంబానీ ఇంటికి ఫోన్ చేసి తన కుమారుడు ముఖేష్ ను పెళ్లి గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తొలుత తనను ఎవరో ఆటపట్టించేందుకు ఇలా కాల్ చేశారని ఆమె భావించినప్పటికే కొద్ది సేపటికే ఇది నిజమేనని ఆమె గ్రహించారు. అలా ఆ తర్వాత వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగి నేటికీ అన్యోన్యంగా కొనసాగుతోంది. నీతా రాకతో ముఖేష్ వ్యాపారాలు సైతం వేగంగా విస్తరించి పెద్దవిగా మారాయి.

ఈ క్రమంలో ఇప్పటికీ నీతా ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. పెళ్లి తర్వాత కూడా కొంత కాలం ఆమె స్కూల్ టీచరుగా పనిచేశారు. ఆ సమయంలో ఒక విచిత్రమేన సంఘటన చోటుచేసుకుంది. దీనిని ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.. తాను టీచరుగా పనిచేస్తున్నప్పుడు ఒక విద్యార్థి తల్లిదండ్రులు ఆమెకు రిలయన్స్ స్పాన్సర్ చేస్తున్న 1987 వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు రెండు టిక్కెట్లు ఆఫర్ చేశారు. అయితే వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించారు.
వాస్తవానికి ఆ తల్లిదండ్రులకు చెందిన పిల్లలకు తాను స్కూల్లో టీచరుగా ఉన్నందున తనకు మ్యాచ్ టిక్కెట్లను ఆఫర్ చేసినట్లు నీతా తెలిపారు. అయితే ఆ తర్వాతి రోజున సదరు వ్యక్తి క్రికెట్ స్టేడియంలో నీతాను ప్రెసిడెన్స్ బాక్సులో చూసి పలకరించారు. మీరు ఇక్కడ ఉన్నారేంటి అంటూ అశ్చర్యంగా ఆమెను అడిగారు. అయితే అతని ప్రశ్నకు కొద్దిసేపు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి ఈమె ముఖేష్ అంబానీ భార్య అని పరిచయం చేటంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఇలా ముందు నుంచి నీతా చాలా సింప్లిసిటీని మేయింటెన్ చేస్తుండేవారు.


Click it and Unblock the Notifications