Reliance AGM: రిలయన్స్ బోర్డ్ నుంచి అంబానీ భార్య ఔట్..! పూర్తి వివరాలు..
Reliance AGM: రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశం నేడు జరుగుతోంది. దీనిలో కంపెనీ ఇప్పటి వరకు సాధించిన మైలురాళ్లు, రానున్న కాలంలో కంపెనీని ముందుకు నడిపేందుకు తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తుంటారు.
ఈ క్రమంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు నుంచి వైదొలగినట్లు కంపెనీ ఏజీఎంలో వెల్లడించారు. ఇదే సమయంలో వారసులు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు కొత్తగా RIL బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లుగా మారినట్లు వెల్లడైంది. హ్యూమన్ రిసోర్సెస్, నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి నియామకం వాటాదారుల ఆమోదం తర్వాత వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమలులోకి రానుంది.

అయితే నీతా అంబానీ ఇకపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌కు మార్గనిర్దేశం చేయడానికి, భారతదేశానికి మరింత గొప్ప ప్రభావాన్ని చూపడానికి తన శక్తియుక్తులు, సమయాన్ని వెచ్చించడానికి ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని వారు గౌరవిస్తున్నట్లు కంపెనీ ప్రకటన పేర్కొంది. అయితే బోర్డుకు శాశ్వత ఆహ్వానితురాలిగా నీతా అంబానీ అన్ని RIL బోర్డు సమావేశాలకు హాజరవుతూనే ఉంటారని వెల్లడైంది.

అంబానీ వారసులు ఇషా, ఆకాష్, అనంత్ ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా గ్రూప్ కంపెనీల బాధ్యతలు చేపట్టి వ్యాపారాలను విజయవంతంగా తమ నాయకత్వంలో ముందుకు తీసుకెళుతున్నారు. తమ ప్రతిభను చూపిస్తూ కంపెనీలను ముందుకు తీసుకెళుతున్నారు. కంపెనీ బోర్డులో చేరిక వల్ల కొత్త ఆలోచనల ప్రేరణకు వీలు కల్పించబడుతుందని బోర్డు అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications