రతన్ టాటాకు Nita Ambani ప్రత్యేక నివాళి.. ఆకాష్ అంబానీకి టాటా గురువు..!!
Nita Ambani on Ratan Tata: గడచిన వారంలో దేశీయం వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. రతన్ టాటాతో తమ కుటుంబానికి ఉన్న స్నేహం గురించి తాజాగా నీతా అంబానీ వెల్లడించారు. ఈ క్రమంలో టాటా ఆత్మకు శాంతి చేకూరాని కోరుతూ ఆమె నివాళులు అర్పించారు.
తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో నీతా అంబానీ రతన్ టాటాకు నివాళిని అర్పించారు. ఈ క్రమంలో రతన్ టాటా "భారతదేశపు గొప్ప కుమారుడు"గా అభివర్ణించారు. రతన్ తమ కుటుంబ స్నేహితుడిగా మాత్రమే కాకుండా అంబానీ కుమారుడు ఆకాష్‌కు మార్గదర్శకుడిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. వయస్సు మీద పడిన రతన్ టాటా ఈ నెల 9న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన వేళ ప్రాణాలు విడిచారు.

కొన్ని రోజుల కిందట రతన్ టాటా మరణంతో తాము బాధపడినట్లు నీతా అంబానీ వెల్లడించారు. రతన్ టాటాతో మామగారు ధీరూభాయ్ అంబానీ, భర్త ముఖేష్ అంబానీకి మంచి మిత్రుడని గుర్తుచేసుకున్నారు. అలాగే తన కుమారుడు ఆకాష్ అంబానీకి రతన్ టాటా గురువుగా ఉన్నట్లు వెల్లడించారు. టాటా సమాజ అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేసే దార్శనికుడు, పరోపకారి అన్నారు. ఈ విందు కార్యక్రమానికి హాజరైన అంబానీ కుటుంబం, వేలాది మంది రిలయన్స్ ఉద్యోగులు మౌనం పాటించారు. అంబానీ కుటుంబం రతన్ టాటాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకోవటంతో పాటు, ఆయనకు నివాళి అర్పించిన వీడియో సోషల్ మీడియాలో వచ్చాయి. దీనిపై కామెంట్ చేస్తూ అనేక మంది తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా అందరూ ఇష్టపడే వ్యక్తిగా చాలా మంది పేర్కొన్నారు.
దీనికి ముందు రతన్ టాటా మరణంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రకటన చేశారు. టాటా మృతి దేశానికి, ఇండస్ట్రీకి చాలా బాధాకరమైన రోజుగా ఆయన పేర్కొన్నారు. రతన్ టాటా మరణం టాటా గ్రూప్‌కు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికి తీరని లోటని ప్రకటనలో పేర్కొన్నారు. నీతా అంబానీ నివాళి అర్పించిన వీడియోలో ముఖేష్ అంబానీ, ఆనంద్ పిరమల్ కూడా కనిపించారు. రతన్ టాటా స్వాతంత్య్రానికి 10 ఏళ్ల ముందే 1937 డిసెంబర్ 28న జన్మించారు. ఆయన 1991-2012 మధ్య కాలంలో టాటా సన్స్ ఛైర్మన్ పదవిలో కంపెనీని వేగంగా వృద్ధి బాటలో కొత్త వ్యాపారాల్లోకి విస్తరింపజేశారు. ప్రస్తుతం రతన్ టాటా మరణంతో నోయెల్ నావల్ టాటా.. టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు.


Click it and Unblock the Notifications