Reliance Retail: అంబానీ టార్గెట్ హైదరాబాద్.. జూబ్లిహిల్స్ కేంద్రంగా..
Reliance Swadesh Store: దేశంలోని మెగా-బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ నుంచి టెలికాం వరకు అనేక కీలక వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కొన్ని కొత్త రంగాల్లోకి తమ వ్యాపారాన్ని అంబానీ కుటుంబం వేగంగా విస్తరిస్తోంది.
ప్రధానంగా ఇషా అంబానీ చేతికి రిలయన్స్ రిటైల్ రావటంతో సరికొత్తగా సహజ ఉత్పత్తులు, హస్తకళలకు సంబంధించిన విక్రయాలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే రిలయన్స్ రిటైల్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీ స్వదేశ్ స్టోర్‌ను ప్రారంభించింది. దీనిని దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఆహార పదార్థాలు, వస్త్రాలు, హస్తకళలు, చేతితో తయారు చేసిన సహజ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ స్టోర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్మన్ నీతా అంబానీ దేశంలో మెుదటి స్టోర్ ప్రారంభించారు.

స్వదేశ్ స్టోర్ భారతదేశ సాంప్రదాయ కళలు, చేతిపనులకు ప్రతీక అని ప్రారంభోత్సవంలో నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. మన దేశంలోని ప్రాచీన కళలను సంరక్షించడం, ప్రోత్సహించడంలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వదేశ్ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని కలిగి ఉందని అన్నారు. ఇది దేశంలోని నైపుణ్యం కలిగిన కళాకారులకు జీవనోపాధిని అందిస్తుందని అన్నారు. అలాగే దేశీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇవ్వాలని రిలయన్స్ భావిస్తున్నట్లు నీతా పేర్కొన్నారు.
అందుకే స్వదేశ్ స్టోర్లను భారత్ లోనే కాకుండా అమెరికా సహా అంతర్జాతీయంగా కూడా విస్తరించడం సంతోషంగా ఉందని నీతా వెల్లడించారు. స్వదేశ్ స్టోర్‌లు చాలా కాలంగా మరచిపోయిన పద్ధతులు, స్థానిక మెటీరియల్‌లను ఉపయోగించి భారతదేశ నైపుణ్యం, అనుభవజ్ఞులైన కళాకారులచే పూర్తిగా చేతితో తయారు చేయబడిన జాగ్రత్తగా క్యూరేటెడ్ ఉత్పత్తులను కలిగి ఉంటాయని రిలయన్స్ రిటైల్ తెలిపింది.


Click it and Unblock the Notifications