Nita Ambani: భారత వ్యాపార కుబేరుడు ముఖేష్ అంబానీ జీవితం ఎంత ఆడంబరంగా ఉంటుందో మనం కనీసం ఊహించలేం. వారి రోజువారీ ఖర్చులు, వారికి ఉండే సౌకర్యాలు సామాన్యుల కలలకు కూడా అందని స్థాయిలో ఉంటాయి.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ దేశంలోనే అత్యంత స్టైలిష్ వ్యాపారవేత్తల్లో ఒకరని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలతో పాటు ఇద్దరు కోడళ్లు కూడా ఉన్నారు. అయితే ఆమె అందం, ష్యాషన్ విషయంలో మాత్రం నేటి తరానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటారు. నీతా అంబానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ అందంగా ఉండే విషయంలో కేర్ తీసుకుంటారు. అయితే ఆకర్షనీయంగా కనిపించే ఆమె రూపం వెనుక మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ పాత్ర చాలా కీలకమైనదని తెలుస్తోంది.

ప్రస్తుతం మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ సేవలను నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీతో పాటు కోడలు శ్లోకా అంబానీ కూడా పొందుతున్నారు. అసలు మిక్కీ కాంట్రాక్టర్ ఒక ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్. అతను హమ్ అప్కే హై కౌన్, దిల్ టు పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, మొహబత్తెయిన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీరే ది వెడ్డింగ్, గుడ్ వంటి చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్నారు.
మిక్కీ కాంటాక్టర్ సేవలను పొందుతున్న వారిలో బాలీవుడ్ నటీమణుల్లో కరీనా కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ కూడా ఉన్నారు. అయితే అతను నీతా అంబానీకి వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్. ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన మిక్కీ కాంట్రాక్టర్ తన సేవలను అందించేందుకు ముంబైలో ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఫీజు ఛార్జ్ చేస్తున్నాడు. అంబానీల దగ్గర పనిచేస్తున్న మిక్కీ జీతం చాలా మంది సీఈవోల శాలరీ కంటే ఎక్కువగా ఉందనే వార్తలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. దీనికి ముందు అతను టోక్యో టోక్యో బ్యూటీ పార్లర్‌లో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేశారు.


Click it and Unblock the Notifications