For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల కోసం నీతా అంబానీ 'హర్ సర్కిల్': చదువుకోవచ్చు, వీడియోలు చూడవచ్చు

|

మహిళా సాధికారత లక్ష్యంగా సోషల్ మీడియా వేదిక హర్ సర్కిల్‌ను ప్రారంభించారు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రకటించారు. మహిళలకు సంబంధించి అన్ని అంశాల (కంటెంట్)కు ఇది వేదికగా నిలవాలన్నది తమ లక్ష్యమన్నారు. హర్‌సర్కిల్‌.ఇన్ ద్వారా లక్షలమంది మహిళలకు మద్దతుగా నిలుస్తామని, ఇందుకు ప్రతి మహిళ ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంలో చేరవచ్చునని తెలిపారు.

దేశం ఏదయినా, సంస్కృతి, సంప్రదాయాలు ఏవైనా మహిళలు ఎవరైనా ఇందులో చేరి ఆలోచనలు పంచుకోవచ్చునని తెలిపారు నీతా అంబానీ. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ తమ ఆలోచనలు పంచుకునేందుకు ఇది వేదికగా ఉంటుందన్నారు.

Nita Ambani launches social media platform Her Circle for women

ఈ ప్లాట్‌ఫాంపై చదువుకోవచ్చు, వీడియోలను చూడవచ్చు. జీవనశైలి, ఆర్థిక, వ్యక్తిగత అభివృద్ధి, పనితీరుకు సంబంధించి మెళకువలు కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం వంటి పలు అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ హర్ సర్కిల్ సబ్‌స్క్రైబర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో ఉన్న ఇది మున్ముందు ఇతర భాషల్లోను అందుబాటులోకి వస్తుంది.

English summary

మహిళల కోసం నీతా అంబానీ 'హర్ సర్కిల్': చదువుకోవచ్చు, వీడియోలు చూడవచ్చు | Nita Ambani launches social media platform Her Circle for women

Reliance Foundation chairperson Nita Mukesh Ambani on Sunday launched a social media platform 'Her Circle' aimed at empowering women.
Story first published: Monday, March 8, 2021, 7:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X