Dhirubhai Ambani నివాళిగా 'Parampara' కార్యక్రమాన్ని ప్రారంభించిన నీతా అంబానీ..
Nita Ambani: భారత వ్యాపార చరిత్రలో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీది చెరగని ముద్రని చెప్పుకోవాలి. అనేక మంది యువ వ్యాపారవేత్తలకు స్పూర్తిని నింపింది ఆయన జీవితం.
ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన గురువుగా ధీరూభాయ్ అభివర్ణించారు. ఈ సందర్భంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో జరిగే వార్షిక పండుగ 'పరంపర'. గురువులకు గౌరవ సూచకంగా సంప్రదాయ సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా దేశప్రజలకు నీతా అంబానీ శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజాలు పద్మవిభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ కార్తీక్ కుమార్‌లతో పాటు వారి శిష్యులు రాకేష్ చౌరాసియా, నీలాద్రి కుమార్ ప్రదర్శన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నీతా అంబానీ తన గురువు, దివంగత మామ ధీరూభాయ్ అంబానీకి నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో హాజరైన సుమారు 2000 మంది ప్రేక్షకుల సమక్షంలో నివాళులర్పించారు. ధీరూబాయ్ తమకు జీవిత పాఠాలను నేర్పించారని.. మార్గదర్శిగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ, కృషితో ప్రతి కల నెరవేరుతుందని నేర్పటంతో పాటు సంబంధాలకు విలువనివ్వడం కూడా నేర్పించారని నీతా అంబానీ తెలిపారు.
మొదటి రోజు సితార్ విద్వాంసుడు పండిట్ కార్తీక్ కుమార్, ఆయన కుమారుడు నీలాద్రి కుమార్, రెండవ అంకంలో 'డివైన్ ఫ్లూట్స్'లో ఫ్లూటిస్ట్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఆయన మేనల్లుడు రాకేష్ చౌరాసియా ప్రదర్శన నిర్వహించారు. అలాగే రెండవ రోజు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, కుమారులు అమన్, అయాన్ అలీ బంగాష్‌లతో కలిసి ఉత్తేజకరమైన సరోద్ పఠనాన్ని అందించారు. వారితో కలిసి ఉస్తాద్ 10 ఏళ్ల కవల మనవళ్లు జోహాన్, అబీర్ అలీ బంగాష్ తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications