Reliance Foundation: గొప్ప మనసు చాటుకున్న నీతా అంబానీ.. 100 ఎకరాల్లో సంరక్షణ కేంద్రం..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. మహారాష్ట్రలోని కర్జాత్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రత్యేక సంరక్షణ కేంద్రానికి ఆమె ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సంరక్షణ కేంద్రంలో వృద్ధులు, అనాథ పిల్లలు, వృద్ధులు, వైకల్యం ఉన్నవారు సహా 5,000 మందికి పైగా జీవితాంతం ఆశ్రయం కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ కేంద్రానికి నీతా ముకేశ్ అంబానీ అనంత్ ఆశ్రయ్ అని పేరు పెట్టారు. ముంబై సమీపంలో జరిగిన భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమానికి ముకేశ్ అంబానీతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ కేంద్రాన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది. లాభాపేక్ష లేని శాశ్వత సంస్థగా దీన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ కేంద్రంలో నివాస గృహాలు, వైద్య సదుపాయాలు, పాఠశాలలు, పునరావాస కేంద్రాలతో పాటు విద్య, ఉపాధి, వినోదానికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అనాథలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రేమతో కూడిన సేవలు అందించడమే లక్ష్యమని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అన్నారు. ఈ కేంద్రంలో ఉన్న పిల్లలు చదువుకోవడం, పనిచేయడం, స్నేహితులను సంపాదించుకోవడం, పండుగలు, వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఈ కేంద్రంలో నివాసితులు, సంరక్షకులు, వైద్య నిపుణులు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 15,000 మందికి ఉండేందుకు అవకాశం ఉంది. ఈ కేంద్రంలో భారతదేశంలోని పవిత్ర నదుల పేర్లతో 8 నివాస గ్రామాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామంలో చిన్న కుటుంబాల తరహా ఇళ్లు ఉంటాయి. హౌస్ పేరెంట్స్, సంరక్షకులు నివాసితులకు తోడుగా ఉంటారు. వారి గదులను సొంత ఇంటి అనుభూతి కలిగించేలా ఏర్పాటు చేస్తున్నారు. తమకు నచ్చిన విధంగా గదులను అలంకరించుకునే స్వేచ్ఛ కూడా నివాసితులకు కల్పించనున్నారు. ఆస్పత్రి నిర్మాణం, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, హైడ్రోథెరపీ సేవల కోసం పునరావాస కేంద్రాలను నిర్మించనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.
అలాగే దేవాలయం, ఉద్యానవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఆట స్థలాలు, శిక్షణా వర్క్‌షాప్‌లు, కేఫ్‌లు, క్రీడా, వినోద సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఉన్నవారికి బేకరీ, కేఫ్‌లు, హస్తకళల కేంద్రాల ద్వారా వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications