For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

150ఏళ్ల ఆ మ్యూజియం చరిత్రలో తొలిసారి ఇండియన్... నీతా అంబానీకి అరుదైన గౌరవం

|

ఆసియా బిలియనీర్, భారత అత్యంత సంపన్నులు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని అతిపెద్ద మెట్రో పాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గాను ఆమెకు ఈ అరుదైన గౌరవం దక్కింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నీతా అంబానీని ట్రస్టీగా ఎన్నుకున్నట్లు మ్యూజియం చైర్మన్ డేనియల్ బ్రాడ్ స్కీ ప్రకటించారు.

వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?

ఆమె వల్లే...

ఆమె వల్లే...

ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు నీతా అంబానీ కావడం గమనార్హం. భారత సంస్కృతీ సంప్రదాయాలు, కళల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో ఆమె చూపిస్తున్న నిబద్ధత అసాధారణమనదని, నీతా అంబానీ మద్దతుతో ప్రపంచం నలుమూల్లోని కళల గురించి అధ్యయనం చేసే సామర్థ్యం మ్యూజియంకు లభించిందని డేనియల్ బ్రాడ్ స్కీ తెలిపారు. ఆమెను బోర్డులోకు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

నీతా అంబానీ ఏమన్నారంటే?

నీతా అంబానీ ఏమన్నారంటే?

భారత కళలను, సంప్రదాయాల విస్తరణకు మెట్రోపాలిటన్ మ్యూజియంకు అండగా నిలబడినందుకు తనకు ఈ గౌరవం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని నీతా అంబానీ అన్నారు. ప్రపంచ వేదికపై భారతీయతను వారి నిబద్ధత తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. తాను రెట్టించిన ఉత్సాహంతో పని చేసేందుకు ఈ అరుదైన గౌరవం ప్రేరణను ఇస్తోందన్నారు.

నీతా అంబానీ షోలు...

నీతా అంబానీ షోలు...

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో పనిచేసిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి గడించిన నీతా క్రీడల రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి భారత రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు అందుకున్నారు. రిలయన్స్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ రిలయన్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విద్య, వైద్యం, సంస్కృతి, కళలు, క్రీడాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో కూడా ప్ర‌తి సంవత్సరం ఆమె షోలను నిర్వహిస్తున్నారు.

లాభాపేక్ష లేని సంస్థ

లాభాపేక్ష లేని సంస్థ

149 సంవత్సరాల పురాతనమైన లాభాపేక్షలేని, మెట్రోపాలిటన్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా 5,000 సంవత్సరాల నుండి విస్తరించి ఉన్న కళల్ని ప్రదర్శిస్తుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది బిలియనీర్లు, ప్రముఖులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ 2018లో 384.7 మిలియన్ డాలర్ల (రూ.2,758 కోట్లు) లాభాలను నివేదించింది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. 150 ఏళ్ల హిస్టరీ కలిగిన ఈ మ్యూజియంకు భారత్ నుంచి తొలిసారి నీతా అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

English summary

150ఏళ్ల ఆ మ్యూజియం చరిత్రలో తొలిసారి ఇండియన్... నీతా అంబానీకి అరుదైన గౌరవం | Nita Ambani appointed to board of New York City's Metropolitan Museum

Philanthropist Nita Ambani was on Tuesday appointed to the board of the largest art museum in the United States, the Metropolitan Museum of Art in New York, Bloomberg reported. Nita Ambani had for years supported exhibitions at the museum.
Story first published: Wednesday, November 13, 2019, 15:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X