Nita Ambani: భారతదేశంలో సంపన్న వ్యాపారవేత్త ఆసియాలోనే కుభేరుడుగా ఉన్న ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ తో అంగరంగ వైభవంగా విలాసవంతమైన వివాహాన్ని నిర్వహించారు. రెండు విలాసవంతమైన ప్రీ-వెడ్డింగ్‌ల నుంచి చివరికి ముంబైలో జరిగిన పెళ్లితో ఈ తంతు ముగిసింది. దీనికోసం అంబానీ ఫ్యామిలీ ఏకంగా రూ.5,000 కోట్లు దీనికోసం వెచ్చించినట్లు మీడియా కథనాల ప్రకారం వెల్లడైంది.
అయితే అనంత్-రాధికల పెళ్లి సెలబ్రిటీల నుంచి ప్రపంచ వ్యాపారవేత్తలు, ప్రముఖులు దీనికి హాజరు కావటంతో పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అంబానీ ఫ్యామిలీ ఈ పెళ్లి కోసం అతిగా ఖర్చు చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. మరికొందరు ఈ డబ్బును లేనివారికి ఛారిటీ కోసం ఇవ్వొచ్చుకదా అంటూ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్లపై రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వివాహం ఆడంబరంగా జరిపించారని వస్తున్న విమర్శలపై అడిగిన ప్రశ్నకు నీతా బదులిచ్చారు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల వివాహానికి తమ వంతు కృషి చేయాలని కోరుకుంటారని నీతా అంబానీ పేర్కొన్నారు. తమ చిన్న కుమారుడు అనంత్ వివాహం విషయంలోనూ అదే చేసినట్లు అభిప్రాయపడ్డారు. ఇది భారతదేశంలో తయారు చేయబడిన బ్రాండ్ అని అనుకుంటున్నానన్నారు. భారతీయ సంప్రదాయాలు, వారసత్వం, సంస్కృతిని కేంద్ర స్థాయికి తీసుకురాగలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
కుమారుడు అనంత్ ఆస్తమా కారణంగా చాలా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో పోరాడుతున్నాడని నీతా అంబానీ వెల్లడించారు. అతను నమ్మకంగా పెళ్లికొడుకుగా వేదికపైకి వెళ్లాడని ఆమె చెప్పారు. 'అమ్మా నేను శారీరకంగా ఎలా ఉన్నానోనది కాదు. అది నా హృదయం లాంటిది' అని చెప్పినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. ఈ క్రమంలో అనంత్ తన జీవిత భాగస్వామి చేయి పట్టుకోవడం తమకు మరపురాని అనుభూతిగా ఆమె పేర్కొన్నారు. అనంత్ పెళ్లి వివాహం జూలై 12, 2024న ముంబైలో జరిగిన జియో వరల్డ్ కన్వెన్షన్‌లో జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలో జూలై 13న ప్రధాని మోదీ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంత్-రాధిక వివాహం జరిగి కొన్ని నెలలైంది. అయితే గత ఏడాది జరిగిన వివాహానికి ముందు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ కోసం అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ-వెడ్డింగ్‌కు టెక్, రాజకీయ, క్రీడా, బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు.


Click it and Unblock the Notifications